గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరి ఖని కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి చొరబడిన దొంగలు రెండు హుండీలను బద్దలు కొట్టి అందులోని నగదుతోపాటు గర్భాలయంలో ఉన్న సుమారు అర కిలో వెండి ఆభరాణాలను ఎత్తుకుపోయారు. శనివారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగులగొట్టి ఉండడంతో స్థానికులకు విషయాన్ని తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.