
ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కడప: బీజేపీ నాయకుడు కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబుల్ రెడ్డి తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని వాసవీరెడ్డి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కడప వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వాసవీ రెడ్డి గతంలో శివానందరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పనిచేసినట్టు తెలుస్తోంది. తనకు శివానందరెడ్డి ఆస్తులు ఏమీ వద్దని, ఓబుల్ రెడ్డి భార్యగా గుర్తింపు కావాలని బాధితురాలు పేర్కొంది. తాను ఎంటెక్ చదివానని, తన కాళ్లపై తాను నిలబడగలనని తెలిపింది. భర్తతో కలిసుండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓబుల్ రెడ్డి, వాసవీ రెడ్డి మధ్య అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.