ఆటో, మోటారుసైకిల్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఆటో, మోటారుసైకిల్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి సబ్‌మార్కెట్ యార్డు వద్ద గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి మరొకరితో కలసి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై కె.ఆనంద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.