
పొడిబారిన కురులకు...
టీ స్పూన్ తేనెను వేళ్లకు అద్దుకొని మాడుకు పట్టించి, పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
టీ స్పూన్ తేనెను వేళ్లకు అద్దుకొని మాడుకు పట్టించి, పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.
♦ ఆముదం-అవకాడో ఆయిల్‌ను సమపాళ్లలో తీసుకొని రాత్రిపూట తలకు పట్టించాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి.
♦ అలోవెరా జ్యూస్‌లో కొద్దిగా నీళ్లు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి.
♦ వారానికి రెండుసార్లు షాంపూతో తలంటుకున్న తర్వాత తప్పనిసరిగా కండిషనర్‌ను వెంట్రుకలకు పట్టించి, అరగంట తర్వాత నీళ్లతో శుభ్రపరచాలి.
♦ వారంలో మూడుసార్లయినా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను మాడుకు పట్టించి, మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.
♦ జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకూడదు.
♦ వెంట్రుకల చివర్లు కత్తిరిస్తే పెరుగుతాయనుకోవడం అపోహ. అయితే, వెంట్రుకల చివర్లు చిట్లి ఉంటే మాత్రం తప్పకుండా కట్ చేయాలి.
♦ డ్రైయ్యర్‌తో తలను ఆరబెట్టకుండా ఉండటం, అతిగా దువ్వకపోవడం, స్ట్రెయిటనింగ్ కోసం ఐరన్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే శిరోజాల ఆరోగ్యం దెబ్బతినదు. నిగనిగలాడుతూ ఉంటాయి.