తేనెతుట్టె రాల్చడానికి చెట్టెక్కి.. | man dies after fall down from tree to catch bee house | Sakshi
Sakshi News home page

తేనెతుట్టె రాల్చడానికి చెట్టెక్కి..

Published Sat, Apr 9 2016 8:16 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

తేనెతుట్టెను రాల్చడానికి చెట్టు ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడి మృతి చెందాడు.

దండేపల్లి(అదిలాబాద్): తేనెతుట్టెను రాల్చడానికి చెట్టు ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్(18) అనే యువకుడు శనివారం ఉదయం తేనెతుట్టెను రాల్చడానికి ఇంటిపక్కనున్న చెట్టు ఎక్కాడు.

ప్రమాదవశాత్తు అక్కడి నుంచి కిందపడ్డాడు. దీంతో ఆతనికి తీవ్ర గాయాలయ్యాయి.గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement