అమలాపురం టౌన్: గాకర్స్ వ్యాధి బాధితురాలు చిన్నారి హనీ తల్లిదండ్రులు కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మిలు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేష్, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, వారు.. చిన్నారి హనీతో పాటు విజయవాడకు వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులను మంగళవారం కలిశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, కమిషనర్ నివాస్, ఏపీ ఎంఎస్‌ఐడీఎస్ డైరెక్టర్ డి.మురళీధరరెడ్డిలను వారు వేర్వేరుగా కలిసి మాట్లాడారు. వీరంతా చిన్నారి హనీని ఎత్తుకుని మరీ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసే ఏర్పాటు చేస్తామన్నారని తండ్రి రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు.
వరదల పరిస్థితిని చూసేందుకు కోనసీమకు వచ్చిన సీఎం జగన్ చిన్నారి హనీ పరిస్థితిని తెలుసుకుని చలించారు. పాప వైద్యానికి ప్రభుత్వం తరఫున ఖర్చు చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. దీంతో రూ.కోటి కేటాయించి, ఖరీదైన ఇంజెక్షన్లను అమెరికా నుంచి రప్పించి వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment