చేతులు మృదువుగా...
♦ బ్యూటిప్స్
చలికాలం చాలామంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడిబారడం. ముఖ్యంగా చేతుల చర్మం పొడిబారి పైన ముడతలు పడి కనిపిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా... రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టీ స్పూన్ల తేనె కలిపి చేతులకు పాదాలకు రాయాలి. 15 నిమిషాలు ఉంచి శుభ్రపరుచుకోవాలి.
గ్లిజరిన్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి ఒక బాటిల్‌లో పోసి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2-3 సార్లు చేతులకు, పాదాలకు రాసి, మసాజ్ చేసి శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.
నిమ్మరసం, కొబ్బరినూనె, గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలిపి రోజూ రాత్రి పడుకోబోయే ముందు చేతులకు, పాదాలకు రాయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.
టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్ల తేనె కలిపి చేతులకు లోషన్‌లా రాసుకోవాలి.
చేతులను శుభ్రంగా కడిగి, తుడుచుకొని, ఆ తర్వాత వీటిలో ఏదైనా ఒకటి రోజూ రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చేతుల చర్మం మృదువుగా మారుతుంది.