హెల్త్ ఫ్యాక్ట్స్
గుండెపోటును నివారించుకునేందుకు ఒక తియ్యటి దారి ఉంది. అదేమంటే రకరకాల తీపి పదార్థాల్లో తీపినిచ్చే పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు పిండి పదార్థాలైన బియ్యం, గోధుమలలో మాల్టోజ్, పండ్లలో ఫ్రక్టోజ్, చెరుకులో సుక్రోజ్, గ్లూకోజ్ ఇలా. అలాగే తేనెలో తీపినిచ్చే మరికొన్ని పదార్థాలతోపాటు ‘టెహ్రలోజ్’ కూడా ఉంటుంది. ఇదే స్వీటెనర్ కొన్ని పుట్టగొడుగులు, ఈస్ట్, సోయాబీన్స్‌లో కూడా ఉంటుంది.
తేనెలోని టెహ్రలోజ్‌ను ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లాక్’ చేరక పోగా గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం తగ్గుదల కనిపించింది. ఈప్లాక్ వల్లనే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి అది గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పని చేసే ఇమ్యూన్ కణాల పుట్టుకకు టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ్రపోటీన్ ఉత్పాదనకు టెహ్రలోజ్ తోడ్పడుతుంది. అలా గుండెపోటును నివారించ వచ్చని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు భావిస్తూ ఆ మేరకు పరిశోధనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment