ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫ్యాక్స్ వేగంగ విజృంభిస్తోంది. కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు ఈ వ్యాప్తి విషయమై ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిది కూడా. డబ్ల్యూహెచ్‌ఓ ఇలా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ప్లూ వంటి తేలికపాటి లక్షణాలలో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. కాంగోలో ఈ వ్యాధి క్లాడ్I తో ప్రారంభమై.. క్లాడ్Ibగా రూపాంతరం చెందినట్లు అధికారులు తెలిపారు.
ఇది ఇంతవరకు లైంగిక సంపర్కం వల్ల వస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్నవాళ్ల నుంచి కూడా సక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది. అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగ దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఈ నేపథ్యలోనే డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు జారీ చేయడమే గాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది. అలాగే నిధులు సమకూర్చి వ్యాధిని అరికట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
దీంతోపాటు ప్రజల ప్రాణాలను కాపాడేలా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రతిస్పందన కూడా అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ అన్నారు. కాగా, ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 17,000 అనుమానిత మంకీఫాక్స్ కేసులు, 517 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 160% కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మొత్తంగా 13 దేశాల్లో కేసులు నమోదయ్యాయి.
(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!)
Comments
Please login to add a commentAdd a comment