Beauty Tips: ముఖం కాంతిమంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం చాలా మంది బ్యూటీ పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే తక్కువ ఖర్చుతోనే మెరిసే మేని, మృదువైన, ముడతలు లేని ముఖ సౌందర్యం మీ సొంతమవుతుంది.
అరటిపండుతో ఇలా
రెండు టీస్పూన్ల అరటిపండు గుజ్జులో టీ స్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. రోజుమార్చి రోజూ ఈ విధంగా చేయడం వల్ల ముఖ చర్మం లోతుగా శుభ్రపడి మెరుపుని సంతరించుకుని యవ్వనంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల వదులుగా మారిన చర్మం బిగుతుగా మారుతుంది.
క్యారట్ గుజ్జును కలిపితే
అరటి పండు గుజ్జుతో క్యారెట్ గుజ్జును కలిపి ప్యాక్ చేసి ముఖానికి వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కావలసినవి: క్యారెట్ గుజ్జు – 3 టేబుల్ స్పూన్స్, అరటిపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – అర టేబుల్ స్పూన్, తేనె – పావు టేబుల్ స్పూన్.
ముందుగా ఒక బౌల్ తీసుకుని... క్యారెట్ గుజ్జు, అరటిపండు గుజ్జు మిక్స్ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పెరుగు, తేనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి ఓ 20 నిమిషాలు పాటు బాగా ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కాఫీ పొడితో మృతకణాలు మాయం
ఫిల్టర్‌లో వేయడానికి ఉపయోగించే కాఫీ పొడి (ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ కాదు)ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని కొద్ది నీటితో పేస్టు చేయాలి. ఆ పేస్ట్‌ని ఒంటికి రాసి, ఐదునిమిషాల తర్వాత వలయాకారంగా మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వు కణాలు, మృతకణాలు రాలిపోవడంతోపాటు చర్మం శుభ్రపడుతుంది. మృదువుగా మారుతుంది.
చెడు వాసన వస్తుంటే..
►రెఫ్రిజిరేటర్‌లో చెడు వాసన వస్తుంటే... దూదిలో వెనిల్లా పౌడర్ వేసి ఫ్రిజ్‌లో ఒక మూలగా ఉంచితే చాలు. ఒక గంట సేపటికి చెడు వాసన మాయమైపోతుంది.
►ఫ్లోరింగ్ టైల్స్‌ను ఎంత శుభ్రంగా తుడిచినా మురికిగానే కనిపిస్తుంటాయి.
►అలాంటప్పుడు అమ్మోనియా కలిపిన నీటిలో స్పాంజ్‌ను ముంచి టైల్స్ తుడిస్తే తళతళమెరుస్తాయి.
చదవండి: జుట్టు రాలడానికి మందులు కూడా ఓ కారణమే.. ఆ మందులు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment