న్యూఢిల్లీ: భారత దేశంలో తేనే ఏరులై పారుతుంది. తేనే ఉత్పత్తి కోసం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన విధానాల కారణంగా ఒక్కసారిగా తేనే ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమర్ అన్నారు. ఢిల్లీలోని కిసాన్ భవన్‌లో జరిగిన బీకీపర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తేనే ఉత్పత్త పెంచేందుకు కేంద్రం రూ. 500 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. ఈ నిధులతో పది వేలకు పైగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వచ్చాయన్నారు. ముఖ్యంగా తేనే, ఫలాలు పండించేందుకు అనువుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం చక్కని ఫలితాలు ఇచ్చిందని ఆయన అన్నారు.
కేంద్రం అమలు చేస్తున్న విధానాల కారణంగా తేనే ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో తేనే ఉత్పత్తి 76 వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఏడేళ్లు గడిచే సరికి ఏకంగా 1.25 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. అదే విధంగా విదేశాలకు ఉత్పత్తి చేస్తున్న తేనే 28 వేల మెట్రిక్ టన్నుల నుంచి 60 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment