గురుకుల పాఠశాల
శ్రీకాకుళం, బొబ్బిలి: పాడుబడిన భవనంలో ఉంటే తేనెపట్టుకోసం వెళ్లిన విద్యార్థులు గోడ కూలడంతో గాయపడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని గురుకులంలో పాత వంటశాల గది శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఈ భవనాన్ని తొలగించకుండా అలానే వదిలేశారు. ఈ గదిలో ఉన్న తేనెపట్టును తీసేందుకు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎస్. రాము, సీహెచ్ ప్రవీణ్, ఎస్. వంశీకృష్ణ వెళ్లారు. తేనెపట్టు తీసేందుకు గోడ ఎక్కడా ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ వంశీకృష్ణకు నడుమభాగంలో తీవ్ర గాయం కావడంతో విజయనగరం తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. వంశీకృష్ణ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడని ప్రిన్సిపాల్ కె. రాంబాబు తెలిపారు. స్వల్పంగా గాయపడిన ఎస్. రాముది మెరకముడిదాం కాగా సీహెచ్ ప్రవీణ్‌ది బలిజిపేట మండలం అంకలాం. తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఎస్. వంశీకృష్ణది మెరకముడిదాం మండలం గోపన్నవలస. ఇదిలా ఉంటే పాఠశాల ఆవరణలో పాడైన భవనాలు తొలగించకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment