
పాలతో మృదుత్వం
• బ్యూటిప్స్
పాలు చర్మ సౌందర్యానికి ఎంతగా మేలు చేస్తాయో అందరికీ తెలిసే ఉంటుంది. పాలల్లో తేనె, ఓట్‌మీల్ కలిపి మిశ్రమం చేసుకుంటే చక్కని ఫలితాన్ని పొందొచ్చు. ముందుగా పావు కప్పు ఓట్స్‌ని తీసుకుని కప్పు తాజా పాలల్లో ఉడకబెట్టుకోవాలి. దానిలో ఒక టీ స్పూను తేనె కలుపుకోవాలి.
ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. చేతి వేళ్లతో నెమ్మదిగా రబ్ చేయాలి. మిశ్రమంలో పసుపు లేదా గంధం పొడిని కూడా కలుపుకోవచ్చు. ప్యాక్‌ను పావుగంట ఉంచుకుని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా వారానికొకసారి చేయడం వల్ల చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.