Beauty Tips: చర్మ సౌందర్యానికై ఇలా చేస్తే చాలు.. | These Amazing Tips For Skin Beauty | Sakshi
Sakshi News home page

Beauty Tips: చర్మ సౌందర్యానికై ఇలా చేస్తే చాలు..

Published Thu, Jun 6 2024 8:53 AM | Last Updated on Thu, Jun 6 2024 8:53 AM

These Amazing Tips For Skin Beauty

పాలలో బ్రెడ్‌ ముక్కలు నానవేసి వాటిని మెత్తగా మెదిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మృదువుగా మిలమిలలాడుతుంది.

  • కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ రుద్ది ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు లేకుండా తాజాగా కనిపిస్తుంది.

  • పులిపిర్లు రాలిపోయిన తర్వాత ఆ మచ్చలు పోవటానికి తేనె, నిమ్మరసం కలిపి ఆ మచ్చల మీద రాస్తూ ఉండాలి.

  • తులసి ఆకులను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆపేస్టును కాని రసాన్ని కాని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. క్రమంతప్పకుండా రోజూ చేస్తుంటే మొటిమలు, వాటి మచ్చలు పూర్తిగా పోవడంతో పాటుచర్మం నునుపుదేలుతుంది.

  • తేనెను గోరువెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరినతర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగామంట మీద వేడి చేయకూడదు. తేనె ఉన్నపాత్రను ఎండలో కాని, వేడి నీటి గిన్నెలోకాని పెట్టి వేడి చేయాలి.

ఇవి చదవండి: ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement