exploding
-
అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు
పుచ్చకాయలు పేలడం గురించి మీకు తెలుసా? ఇదేం విచిత్రం.. సాధారణంగా గట్టిగా నేలకేసి కొట్టినా పుచ్చకాయ పగలదు కదా అంటారా.. కానీ అమెరికాలో మాత్రం ఈమధ్య పుచ్చకాయలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో అక్కడి వారు పుచ్చకాయలు కొనాలంటేనే హడలిపోతున్నారట. ఇలా ఎందుకు జరగుతుంది? అసలు పుచ్చకాయలు పేలిపోవడానికి గల కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అమెరికాలో లీలా ఫాడెల్ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇలా లీలా ఫాడెల్ మాత్రమే కాదు.. అమెరికాలో చాలామందికి ఈ మధ్య ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. పుచ్చకాయలు ఇలా సడెన్‌గా పేలిపోతున్నాయని ఇదేం విచిత్రం అంటూ నివ్వెరపోతున్నారు. బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానిపై రీసెర్చ్ మొదలైంది. అమెరికాలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. పుచ్చకాయలో ఒక నిర్ధిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని దానివల్ల సహజ చక్కెర, ఈస్ట్ అనే పదార్థాలు ఉత్పన్నం అవుతాయని తేలింది. పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని బ్యాక్టీరియా లేదా ఫంగల్ వ్యాధి కూడా కారణం కావచ్చని కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ అన్నారు. పంట త్వరగా చేతికి రావాలని కొందరు రసాయనాలు కలుపుతున్నారని, ఇవి పుచ్చకాయల్లో ఉండే నేచురల్ షుగర్‌తో కలిసిపోయి పేలిపోతున్నట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది. అంతేకాకుండా వీటిని ఒకేసారి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట పెట్టడం కూడా ఈ పేలుళ్లకు కారణం కావచ్చని తెలియజేశారు. -
కెమెరా కంటికి చిక్కిన సూపర్నోవా
సువిశాలమైన అంతరిక్షం.. ఎన్నెన్నో విశేషాలకు ఆలవాలం. అంతరిక్షంలోని కోటాను కోట్ల నక్షత్రాల్లో కొన్ని అంతరించిపోతుంటాయి. తారల జీవితకాలం ముగియగానే వాటిలోని ఇంధనం మండిపోయి, అదృశ్యమైపోతుంటాయి. చివరి దశకు వచ్చినప్పుడు ఒక నక్షత్రం ఎలా ఉంటుంది? అంతమయ్యే ముందు ఏం జరుగుతుంది? నక్షత్రాలు మృత తారలుగా మారడానికి ముందు పరిణామాలేంటి? ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తి ఉన్నప్పటికీ మన కంటికి కనిపించవు. నక్షత్రాలు మన భూమికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడమే ఇందుకు కారణం. తారల కేంద్ర భాగం(కోర్)లో అణు విచ్ఛిత్తి జరిగి పేలిపోతుంటాయి. నక్షత్రాలు పేలిపోయి, అంతం కావడాన్ని సూపర్నోవా అంటారు. ఇలాంటి ఒక సూపర్నోవాను ప్రముఖ అస్ట్రో ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ తన కెమెరాలో చక్కగా బంధించారు. పిన్‌వీల్ లేదా ఎం10 అనే పాలపుంత(గెలాక్సీ)ని ఆయన తన టెలిస్కోప్‌తో నిశితంగా పరిశీలించారు. ఆ పాలపుంతలో కాలం తీరిన ఒక నక్షత్రం పేలిపోయి, అంతమైపోవడాన్ని టెలిస్కోప్ ద్వారా కొన్ని ఫ్రేమ్‌లను తన కెమెరాలో బంధించి, దృశ్యబద్ధం చేశారు. దీన్ని ఒక యానిమేషన్‌గా మార్చారు. మృత నక్షత్రాన్ని చిత్రీకరించడానికి ఆ గెలాక్సీకి సంబంధించిన కలర్ డేటాను ఉపయోగించానని ఆండ్రూ మెక్‌కార్తీ చెప్పారు. నక్షత్రానికి చెందిన 10 నిమిషాల ఎక్సపోజర్తో యానిమేషన్ రూపొందించినట్లు తెలిపారు. ఎరుపు, తెలుపు వర్ణాలతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. మరో విశేషం ఏమిటంటే.. సూర్యుడు తన జీవితకాలమంతా వెలువరించే శక్తి కంటే ఎక్కువ శక్తి కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సంభవించే సూపర్నోవాలో వెలువడుతుందట! కాంతి, వేడి, రేడియేషన్ రూపంలో ఈ శక్తి ఉద్గారమవుతుంది. సూపర్నోవా గాఢమైన ప్రభావం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పిన్‌వీల్(ఎం10) పాలపుంత(మిల్కీవే) ప్రస్తుతం మనం ఉంటున్న పాలపుంత కంటే 70 శాతం పెద్దది. దాని వ్యాసం 1,70,000 కాంతి సంవత్సరాలు. మన భూమి నుంచి 21 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
లక్నో: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది. దాదాపుగా అన్ని ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలే ఉపయోగిస్తున్నారు. అయితే, వాటిని వినియోగించటంలో చిన్న చిన్న తప్పులు చేయటం వల్ల ఒక్కోసారి ప్రాణాలపైకి వస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లోని ఓ ఇంటిలో ఎల్ఈడీ టీవీ పేలిపోయి 16 ఏళ్ల అమరేందర్ అనే బాలుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగు చూసింది. తన స్నేహితులతో కలిసి బాధితుడు సినిమా చూస్తుండగా ఒక్కసారిగా టీవీ పేలిపోయింది. పేలుడు దాటికి భవనం గోడలు సైతం బీటలువారాయంటే ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో ఊహించవచ్చు. ఈ ఘటనలో బాధితుడి తల్లి, సోదరుడు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విధంగా టీవీలు పేలిన సంఘటనలు చాలా అరుదు. దీనికి గల కారణాలపై నిపుణులు సైతం అంచనాకు రాలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. దురదృష్టవశాత్తు ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గోడకు బిగించిన ఎల్ఈడీ టీవీ పేలటం వల్లే బాలుడు మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.’ అని గాజియాబాద్ పోలీసు అధికారి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. టీవీ పేలిపోవటంతో గోడలకు ఏర్పడిన పగుళ్లు ఎల్ఈడీ టీవీ బ్లాస్ట్‌కు కారణాలు.. ►పాత, నకిలీ కెపాసిటర్: ఎల్ఈడీ టీవీలు పేలడానికి ప్రధానంగా పాత లేదా నకిలీ కెపాసిటర్ కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన స్థాయిలో కెపాసిటర్ విద్యుత్తును సరఫరా చేస్తుంది. అయితే, కెపాసిటర్ వల్ల ఆ స్థాయిలో పేలుడు సంభవించకపోవచ్చు. ► ఓల్టేజ్ హెచ్చుతగ్గులు: విద్యుత్తు ఓల్టెజ్ హెచ్చుతగ్గులకు లోనవటమూ ఓ కారణంగా చెప్పవచ్చు. ఒక్కసారిగా హైఓల్టేజ్ సరఫరా అవుతే టీవీలు పేలిపోతాయి. ► ఓవర్ హీట్: టీవీ ఎక్కువగా వేడెక్కడం సైతం పేలిపోవటానికి దారితీస్తుంది. ఒక్కటికంటే ఎక్కువ డివైజ్లతో కనెక్ట్ చేస్తే ఓవర్ హీట్ అవుతుంది. నకిలీ కెపాసిటర్ లాగే ఓవర్ హీట్ కూడా పేలుడుకు కారణమవుతుంది. ►నిర్వహణ లేకపోవటం: టీవీని గోడకు బిగించామంటే దానిని పట్టించుకోరు. నిర్వహణ సరిగా లేకపోవటం, రిపేర్లు సరైన రీతిలో చేయించకపోవటం వంటివి సైతం పేలడానికి దారితీస్తాయి. రిపేర్ వచ్చినప్పుడు సరైన సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్లాలి. రిపేర్ కోసం నాణ్యతకు ప్రాధాన్యత నివ్వాలి. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ హక్కుల గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?
స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలకు ఏడు నెంబర్ ఏడిపిస్తోందా? అసలు అచ్చికి రావడం లేదా? అంటే అవుననే అనిపిస్తోంది.ఇటీవలే శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్7 పేలుడు ఘటనలు మార్కెట్లో తీవ్ర సంచలనం రేపగా.. ఇప్పడు అదే బాటలో మరో దిగ్గజం ఆపిల్‌కు షాక్ తగిలిందట. ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ పేలిపోయిందని వార్తలు బయటికి పొక్కాయి. ఎప్పుడూ ఒకరినొకరు కాఫీ చేసుకుంటూ స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఏలే ఈ రెండు దిగ్గజాలు ఏడు నెంబర్‌తో తాజా ఫ్లాగ్‌షిప్‌లను విడుదల చేశాయి. కానీ ఈ రెండింటికి ఏడు నెంబర్ షాకిస్తూ పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే గెలాక్సీ నోట్7 పేలుళ్ల సమస్య శాంసంగ్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 బ్యాటరీ లోపంతో పేలిపోగా, ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ మోడల్ సరియైన కారణాలు వెల్లడికాలేదు. ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుని దగ్గరికి పేలిపోయిన ఫోన్ డెలివరీ అయింది. ఆర్డర్‌ను అందుకుని బాక్స్ తెరిచిచూడగానే పేలిపోయిన ఫోన్‌ను గుర్తించినట్టు వినియోగదారుడు పేర్కొన్నాడు.ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయ్యే మధ్యలో ఈ పేలుడు సంభవించి ఉంటుందని ఫోన్ యజమాని చెబుతున్నాడు. ఆపిల్ ఈ విషయంపై ఇప్పటికీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.కానీ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుడు రీప్లేస్మెంట్ కోసం ఆపిల్ సంస్థను ఆశ్రయించాడు. ప్రస్తుతం పేలిపోయిన ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
జిలెటిన్‌స్టిక్స్ పేలి ఒకరిమృతి