ఎస్పీని కలిసేందుకు వచ్చిన గఫూర్, ఖాజాబీ దంపతులు
అనంతపురం క్రైం: ‘ఎప్పుడు కన్ను మూస్తామో తెలియదు. కాసింత బువ్వ పెట్టండ్రా అంటే కడుపున పుట్టిన బిడ్డలే కాదంటున్నారు. ఓ పిడికెడు అన్నం పెట్టించండి సారూ..’ అంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఎదుట శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడకు చెందిన గఫూర్, ఖాజాబీ దంపతులు వేడుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వారు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.
కొడుకులు పట్టించుకోకపోవడంతో అనంతపురంలోని రాణీనగర్‌లో ఉంటున్న కూతుళ్ల వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు వివరించారు. వృద్ధ దంపతుల సమస్యపై ఎస్పీ తీవ్రంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ శ్రీసత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయానికి సిఫారసు చేశారు.
వివిధ సమస్యలపై పోలీసు స్పందన కార్యక్రమానికి 91 ఫిర్యాదులు అందాయి. వీటిని ఎస్పీతో పాటు ఏఎస్పీ నాగేంద్రుడు, ఎస్‌బీ సీఐ చక్రవర్తి స్వీకరించి, పరిశీలించారు. 2017లో తన భర్త చనిపోయిన తర్వాత అతని పేరుపై ఉన్న ఆస్తి మొత్తాన్ని అత్తింటి వారు కాజేసి అన్యాయం చేశారని, తనకు న్యాయం చేయాలంటూ పెనకచెర్లకు చెందిన మొలకల సువర్ణ ఫిర్యాదు చేసింది.
చదవండి: (ఒకే గొడుగు కిందకు పాఠశాల విద్య)
Comments
Please login to add a commentAdd a comment