Sevadas Movie Completed Sensor Works: సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ కీలక పాత్రలు పోషించిన బహుభాష చిత్రం 'సేవదాస్'. శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో కెపీఎన్ చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా, రేఖా నిరోష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కెపీఎన్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు చిత్రంపై ప్రశంసలు కురిపించారు. బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే 'సేవదాస్' సినిమాను బంజారా భాషలోనే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు.
64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రూపొందిన సేవాదాస్ నిర్మాణంలో పాల్గొనడం గర్వంగా ఉందని కార్యనిర్వహక నిర్మాత ఎమ్ బాలు చౌహాన్ పేర్కొన్నారు. ఈ చిత్రం తెరకెక్కించడంలో శ్రమించిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వీలైనంత త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
Sevadas Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న పాన్ ఇండియా మూవీ 'సేవదాస్'
Published Fri, Feb 25 2022 4:02 PM | Last Updated on Fri, Feb 25 2022 4:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment