
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘కాప్చర్’ మోడల్‌లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంతకుముందు కంటే ఈకారులో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. పాదచారుల భద్రతా ప్రమాణాల వంటి అన్ని రకాల దేశీ భద్రతా చట్టాలకు అనుగుణంగా ఈ నూతన వెర్షన్ రూపొందినట్లు తెలిపింది.
ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలుగా ప్రకటించింది. ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తో కూడిన అత్యున్నత బ్రేకింగ్ వ్యవస్థ (ఏబీఎస్), బ్రేక్ అసిస్టెన్స్, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్, రెండు ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది.