సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికం
సాక్షి, హైదరాబాద్: వర్షాలు కురవాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి ఆరు డిగ్రీలు అధికంగా రికార్డు అవుతున్నాయి. గత 24 గంటల్లో హైదరాబాద్‌లో సాధారణంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 37 డిగ్రీలు నమోదైంది. ఏకంగా ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంది.
అలాగే మహబూబ్‌నగర్‌లో 32 డిగ్రీలు సాధారణంగా నమోదు కావాల్సి ఉండగా... అక్కడ 38 డిగ్రీలకు చేరింది. మెదక్‌లో 31 డిగ్రీలకు గాను... 36 డిగ్రీలు రికార్డు అయింది. హన్మకొండలో 32 డిగ్రీలకు గాను... 37 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌లలో సాధారణం కంటే 4 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 3 డిగ్రీలు అదనంగా నమోదైంది. ఇదిలావుండగా శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్య రాష్ట్రంలో సాధారణంగా సరాసరి 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఎక్కడా ఒక్క చుక్క వర్షం కురవలేదు. 100 శాతం లోటు వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.
మండుతున్న ఎండలు
Published Mon, Jul 6 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement