
రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్నాయి. శనివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా రుద్రవరం, ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 43.5 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా వతలూరులో 42. 7, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.4, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42.2, విజయనగరం జిల్లా గుర్లలో 42.1, తిరుపతి జిల్లా గూడూరులో 41.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో 96 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 27 మండలాల్లో తీవ్రవడగాలులు, 103 మండలాల్లో వడగాలులు వీచాయి. ఆదివారం అల్లూరి జిల్లా చింతూరులో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. –సాక్షి, అమరావతి