
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బుధవారం పలుచోట్ల 43 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలో 43 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్‌లోనే ఎండలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.