-అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 28 మంది
హైదరాబాద్: వడదెబ్బకు ప్రజలు పిట్లల్లా రాలుతున్నారు. బుధవారం నాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 66 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అందులో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 28 మంది, మెదక్ లో 11 మంది, నిజామాబాద్ జిల్లా లో 7 మంది, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 5 మంది చొప్పున మృతి చెందారు.
ఇక ఆదిలాబాద్ లో నలుగురు, వరంగల్ జిల్లాలో నలుగురు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు వడదెబ్బకు చనిపోయారు. ఏప్రిల్ మొదటి వారంలోనే అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 40 డిగ్రీల పైన నమోదైతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.