సాక్షి, రాజమండ్రి :సూర్యుడు ఏమైనా భూమి పర్యటనకు బయల్దేరి నానాటికీ దగ్గరకు వస్తున్నాడా అన్నట్టు.. ఎండలు మండిపడుతూనే ఉన్నాయి. జిల్లాలో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. రాజమండ్రిలో జిల్లాలోనే అత్యధికం గా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడలో ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందుకు 1.15 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని లెక్కగట్టారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం నుంచి 42 వేల క్వింటాళ్లు, ఏపీ సీడ్స్ ద్వారా 14 వేల క్వింటాళ్లు, రైతుల నుంచి రైతులు 22వేల క్వింటాళ్లు, ప్రైవేట్ కంపెనీల ద్వారా 37 వేల క్వింటాళ్ల విత్తనాలను సేకరించాలని వ్యవసాయ శాఖాధికారులు భావించారు. వరంగల్, కరీంనగర్ నుంచి విత్తనాలు రాకపోవడం, స్థానికంగా గత ఖరీఫ్, రబీలో ఆశించిన దానిలో 50 శాతం కూడా ఉత్పత్తి కాకపోవడంతో స్వర్ణ విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది.
రాష్ట్ర విభజనతో అందని విత్తనం
జిల్లాకు అవసరమైన విత్తన సేకరణ వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువగా జరుగుతుంది. ఏపీ సీడ్స్‌తోపాటు ప్రైవేట్ డీలర్లకు ఈ జిల్లాల నుంచి విత్తనాలు దిగుమతి అవుతుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు అందాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల విత్తనాల్లో ఈ రెండు జిల్లాల నుంచి 35 వేల క్వింటాళ్లకు పైబడి సేకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాల సేకరణకు వీలుగా వాటి అమ్మకాలపై ప్రభుత్వం కొంత నియంత్రణ ఉంచేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడం, గత ఖరీఫ్ పంటనష్టం వల్ల స్వర్ణకు మద్దతు ధరకు మించి (క్వింటాల్ రూ.1,400) ధర రావడంతో ఆ రైతులు విత్తనాల నిల్వలు చేయకుండా అమ్మకాలు చేపట్టారు. దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సకాలంలో గుర్తించలేకపోయింది. ఏపీ సీడ్స్, ప్రైవేట్ డీలర్లు సైతం ముందుగా విత్తన సేకరణపై దృష్టి సారించకపోవడం, ఆ జిల్లాల నుంచి దిగుమతి లేక రైతులు ఇప్పుడు విత్తన కొరత ఎదుర్కొనాల్సి వస్తోంది.
స్థానికంగానూ తక్కువే
జిల్లా రైతులు ఖరీఫ్‌లో స్వర్ణరకం సాగు ఎక్కువగా చేస్తుంటారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సాగు విస్తీర్ణం కాస్త తగ్గినా డెల్టాలో సుమారు 75 శాతం పంట పొలాల్లో స్వర్ణరకం సాగే జరుగుతుంది. గత ఖరీఫ్‌లో ఈశాన్య రుతుపవనాలు, హెలెన్ తుపాను వల్ల 2.50 లక్షల ఎకరాల్లో పంట తుడుచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చిన దిగుబడిలో కూడా తేమ వచ్చిన, రంగు మారిన, దెబ్బతిన్న ధాన్యం ఎక్కువ. ఈ ధాన్యం నిల్వ చేస్తే దెబ్బతింటుందని రైతులు విత్తన నిల్వ చేయలేదు. గ్రామీణ విత్తనోత్పత్తిలో భాగంగా సాగు చేసిన పొలాల్లో సైతం విత్తనాల ధాన్యం దెబ్బతింది. దీంతో రైతుల వద్ద విత్తనం ఆశించిన స్థాయిలే లేకుండాపోయింది. అప్పట్లోనే ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చినా స్పందించేవారు లేక రైతులు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. రబీలో సైతం రైతులు ఖరీఫ్ విత్తనాల కోసం స్వర్ణ రకం సాగు చేస్తుంటారు. మొత్తం రబీ సాగులో నాలుగు శాతం స్వర్ణసాగు ఉంటుంది. గత రబీలో ఇది రెండు శాతానికి పడిపోయింది. దీనివల్ల కూడా విత్తన కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.
అటు కాక..ఇటు కోత
Published Sun, Jul 6 2014 12:15 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement