సాక్షి, రాజమండ్రి :కరెంటు భారం ప్రజలకు తప్పేటట్టు లేదు. ఎవరెంత మొత్తుకున్నా చార్జీల పెంపునకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటూపోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి బుధవారం కాకినాడ జేఎన్‌టీయూలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోంది. ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు వీలుగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) చేసిన చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయం తెలుసుకుంటారు. నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేసినా, ఆ సందర్భంగా వస్తున్న ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. దీంతో భారం తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అయినప్పటికీ కాకినాడలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, ప్రజాసంఘాలు చార్జీల పెంపును ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నాయి.
జిల్లాపై రూ.13 కోట్లు పైగా భారం
చార్జీల పెంపు ప్రతిపాదనలు అమలులోకి వస్తే జిల్లాపై నెలకు రూ.13 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. వంద యూనిట్లలోపు విని యోగదారులకు చార్జీల మోత ఉండదని ప్రభుత్వం చెబుతున్నా అది కంటితుడుపు కూడా కాదని వినియోగదారులు అంటున్నారు. జిల్లాలో మొత్తం 14,39,670 మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో 12.44,626 మంది గృహ వినియోగదారులే. వీరిలో తాజా నెల బిల్లు ప్రకారం 50 యూనిట్లలోపు వినియోగదారులు 5.76 లక్షల మంది ఉన్నారు. 51 నుంచి 100 యూనిట్ల లోపు వినియోగిస్తున్నవారు 4.37 లక్షల మంది ఉన్నారు.
వీరి సంఖ్య నెలనెలా మారుతూంటుంది. వచ్చేది వేసవి కావడంతో ప్రతి వినియోగదారుని ఇంటా వినియోగం భారీగా ఉంటుంది. మార్చి తర్వాత లెక్కలు పూర్తిగా తారుమారవుతాయి. అప్పటి లెక్కల అంచనాలు పరిశీలిస్తే 51 నుంచి 100 యూనిట్లలోపు వినియోగించేవారి సంఖ్య రెండు లక్షలకు తగ్గిపోతుంది. తద్వారా వేసవిలో ప్రభుత్వ రాయితీ ప్రభావం పేద, మధ్యతరగతి వినియోగదారులపై కనీసం 20 శాతం కూడా ఉండదు.
షాక్ తప్పదా!
Published Wed, Feb 25 2015 12:14 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement