
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.
ప్రధానంగా అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా కరీంనగర్ జిల్లా తంగులలో 45.4 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.2 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.2 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment