
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతాయని, జాలర్లను చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment