costal Andhrapradesh
-
మూడు రోజులు వానలే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. శనివారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ కోరారు. -
‘టిట్లీ’ ముప్పు.. మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం : తుపాను, బలమైన గాలులు వీస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి తుపాను మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారని సమాచారం. టిట్లీ ప్రభావం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు తెలిపారు. (చదవండి : ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్! ) రేపు, ఎల్లుండి విస్తారమైన వర్షాలు కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ‘టిట్లీ’ కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం బలపడి ఈరోజు రాత్రి (మంగళవారం) లేదా రేపు ఉదయం తుపానుగా మారే అవకాశం ఉందని అన్నారు. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించి ఈ నెల 11న కళింగపట్నం (ఏపీ) - గోపాలపూర్ (ఒడిషా) మధ్య తుపాను తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ రోజు తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం 55-65 కిలోమీటర్ల వేగంతో, గురువారం 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. -
ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ‘టిట్లీ’ తుఫాన్!
-
ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్!
సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లిరూరల్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుంది. ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారు. ఈమేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి వెల్లడించింది. సోమవారం రాత్రికి ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి 620, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 650 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశలో పయనిస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని తీవ్రత పెరిగి బుధవారం నాటికి తుపానుగా మారి, ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుందని ఐఎండీ వివరించింది. వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్లు, తుపానుగా మారాక బుధ, గురు వారాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరకోస్తా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, తుపాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవుతుందని ఐఎండీ తెలిపింది. -
ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక!
సాక్షి, విశాఖపట్నం : తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఈ తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి 310, గోపాల్‌పూర్‌కు 300 తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పూరి మధ్య గోపాల్‌పూర్‌కు తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 60 నుండి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రపు అలలు సాధారణం కంటే 0.5మీటర్లు ఎగిసిపడే అవకాశం ఉన్నందున శ్రీకాకుళంలోని లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అప్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు చోట్లు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి ఆదేశాలు జారీచేశారు. తీరప్రాంతంలోని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్(08942 240557) ఏర్పాటు చేశామని తెలిపారు. తీరప్రాంతంలోని మెరైన్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొరుగు రాష్ట్రం ఒడిశాలో కూడా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
కోస్తాంధ్రలో చిరు జల్లులు
ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ మీదగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించిందని... ఈ నేపథ్యంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంటుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. దాంతో కోస్తాలో ఒకట్రెండు చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. పగటి ఉష్టోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం చిరు జల్లులు పడిన... సాయంత్రం మాత్రం నగరంలో ఓ మోస్తరుగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే.