సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తుకు చెక్ పెడుతూ సీపీఎం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తాజాగా 14 మంది అభ్యర్థులతో సీపీఎం జాబితాను తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం షాకిచ్చింది. పొత్తుల విషయంలో హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకుని తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో 14 మంది అభ్యర్థులతో సీపీఎం జాబితాను విడుదల చేసింది. మరో స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. వారి పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామని తమ్మినేని తెలిపారు.
మరోవైపు.. తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేయాలని జానారెడ్డి కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటన వాయిదా కుదరదని తమ్మినేని గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో మాట్లాడం తప్ప ఎలాంటి నిర్ణయం ఉండటంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
అభ్యర్థులు వీరే..
భద్రాచలం- కారం పుల్లయ్య
అశ్వారావుపేట- పి. అర్జున్
పాలేరు- తమ్మినేని వీరభద్రం
వైరా- భూక్య వీరభద్రం
మధిర- పాలడుగు భాస్కర్
ఖమ్మం- శ్రీకాంత్
మిర్యాలగూడ- జూలకంటి రంగారెడ్డి
సత్తుపల్లి- భారతి
నకిరేకల్- చిన్న వెంకులు
పటాన్‌చెరు- మల్లికార్జున్
ముషీరాబాద్- దశరథ్
జనగామ- కనకారెడ్డి
భువనగిరి- నర్సింహ
ఇబ్రహీంపట్నం- యాదయ్య.
ఇది కూడా చదవండి: రూట్ మార్చిన కేటీఆర్.. గంగవ్వతో నాటుకోడి కూర వండి..
Comments
Please login to add a commentAdd a comment