లోక్‌సభ ఎన్నికల కోసమే ‘ఇండియా’ కూటమి | India Alliance Only For Lok Sabha Election | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల కోసమే ‘ఇండియా’ కూటమి

Oct 31 2023 6:23 AM | Updated on Oct 31 2023 6:23 AM

India Alliance Only For Lok Sabha Election - Sakshi

న్యూఢిల్లీ:  2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, కలిసికట్టుగా పోటీ చేయడానికి విపక్షాలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం చెప్పారు. ప్రస్తుత ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూటమి పక్షాలు పరస్పరం అవగాహనతో పని చేయాలని సూచించారు.

రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అభ్యర్థుల జాబితాకు కేంద్ర కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపామని, తెలంగాణ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్రాల స్థాయిలోనూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement