సర్దుకుపోదాం..! | Congress Alliance With Comrades | Sakshi
Sakshi News home page

సర్దుకుపోదాం..!

Published Fri, Oct 20 2023 5:48 AM | Last Updated on Fri, Oct 20 2023 5:48 AM

Congress Alliance With Comrades - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో వామపక్షాలు సర్దుకుపోయే ధోరణిలో ఉన్నట్టు కన్పి స్తున్నాయి. రెండేసి చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకున్న సీపీఐ, సీపీఎంల్లో తాము పోటీ చేసే స్థానాల విషయంలో మాత్రం కొంత గందరగోళం నెలకొని ఉంది. కొత్తగూడెం, మునుగోడు స్థానా లను సీపీఐ కోరగా, కాంగ్రెస్‌  కొత్తగూడెం, చెన్నూ రు స్థానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

కానీ తమకు మునుగోడే కావాలని ఇప్పటివరకు పట్టు బడుతున్న సీపీఐ తాజాగా కాస్త మెత్తబడుతున్నట్టు తెలిసింది. అవకాశం ఉంటే మునుగోడు ఇవ్వాలని, లేనిపక్షంలో చెన్నూరు బరిలో దిగుతామంటూ సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. ఇక సీపీఎం మిర్యా లగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానా లు ఇవ్వాలని కోరింది. అయితే భద్రాచలంలో ఇప్ప టికే తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌.. మిర్యాల గూడ స్థానానికి మాత్రం సరే అంది.

కానీ పాలేరు విషయంలోనే ఎటూ తేలడం లేదని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. పాలేరు సీటు ఇచ్చేది లేదని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంకో సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదో ఒక సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుబడుతుండటంతో అనూహ్యంగా ఇప్పుడు ఆ జిల్లాలోని వైరా రిజర్వుడు స్థానం తెరపైకి వచ్చింది. వైరా నియో జకవర్గంలో సీపీఎంకు మంచి పట్టుంది. కాబట్టి పాలేరు సాధ్యం కాకుంటే వైరాను అడగాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ వైరాలో కాంగ్రెస్‌ అభ్యర్థినే బరిలో దింపాలని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పట్టదలతో ఉన్నట్టు తెలిసింది. దీంతో వైరా కూడా ఎంతవరకు ముడిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  

వామపక్షాల అసహనం!
కాంగ్రెస్‌తో పొత్తు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవ డంతో సీపీఐ, సీపీఎం నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినా ఇంకా పని చేసుకోండంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లపై కూడా అను మానాలున్నాయా అనే సందేహాలు ఆ పార్టీ కార్య కర్తల్లో వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు సీపీఎంకు మిర్యాలగూడ ఖరారు చేసినా.. ఆ సీటు విషయంలోనూ పూర్తిగా భరోసా ఇవ్వలేదని ఆ పార్టీ చెబుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఎక్కడ పోటీలో ఉంటామో స్పష్టత లేకపోవడంతో వామపక్షాల నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రచారానికి తగిన సమయం ఉండదని అంటున్నాయి. అంతేకాదు పొత్తులపై తమ కేడర్‌కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నా మని చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ కూడా ప్రచారంలో దూసుకుపోతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

బీఎల్‌ఎఫ్‌ రెండో జాబితా
బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ఆ పార్టీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులను బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకా‹శ్‌ ప్రకటించారు.

ఇల్లెందు బరిలో గుమ్మడి అనురాధ
గతంలో ఇల్లెందు నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అనురాధ ఉస్మానియా లా కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తనకు న్యూడెమొక్రసీ, ప్రజాపంథా సహా పలు సీపీఐ (ఎంఎల్‌) పార్టీల మద్దతు ఉన్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే బలమైన తండ్రి వారస త్వం ఆమెకు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement