comrades
-
సర్దుకుపోదాం..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో వామపక్షాలు సర్దుకుపోయే ధోరణిలో ఉన్నట్టు కన్పి స్తున్నాయి. రెండేసి చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకున్న సీపీఐ, సీపీఎంల్లో తాము పోటీ చేసే స్థానాల విషయంలో మాత్రం కొంత గందరగోళం నెలకొని ఉంది. కొత్తగూడెం, మునుగోడు స్థానా లను సీపీఐ కోరగా, కాంగ్రెస్ కొత్తగూడెం, చెన్నూ రు స్థానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ తమకు మునుగోడే కావాలని ఇప్పటివరకు పట్టు బడుతున్న సీపీఐ తాజాగా కాస్త మెత్తబడుతున్నట్టు తెలిసింది. అవకాశం ఉంటే మునుగోడు ఇవ్వాలని, లేనిపక్షంలో చెన్నూరు బరిలో దిగుతామంటూ సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. ఇక సీపీఎం మిర్యా లగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానా లు ఇవ్వాలని కోరింది. అయితే భద్రాచలంలో ఇప్ప టికే తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. మిర్యాల గూడ స్థానానికి మాత్రం సరే అంది. కానీ పాలేరు విషయంలోనే ఎటూ తేలడం లేదని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. పాలేరు సీటు ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంకో సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదో ఒక సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుబడుతుండటంతో అనూహ్యంగా ఇప్పుడు ఆ జిల్లాలోని వైరా రిజర్వుడు స్థానం తెరపైకి వచ్చింది. వైరా నియో జకవర్గంలో సీపీఎంకు మంచి పట్టుంది. కాబట్టి పాలేరు సాధ్యం కాకుంటే వైరాను అడగాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ వైరాలో కాంగ్రెస్ అభ్యర్థినే బరిలో దింపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పట్టదలతో ఉన్నట్టు తెలిసింది. దీంతో వైరా కూడా ఎంతవరకు ముడిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వామపక్షాల అసహనం! కాంగ్రెస్‌తో పొత్తు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవ డంతో సీపీఐ, సీపీఎం నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినా ఇంకా పని చేసుకోండంటూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లపై కూడా అను మానాలున్నాయా అనే సందేహాలు ఆ పార్టీ కార్య కర్తల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీపీఎంకు మిర్యాలగూడ ఖరారు చేసినా.. ఆ సీటు విషయంలోనూ పూర్తిగా భరోసా ఇవ్వలేదని ఆ పార్టీ చెబుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఎక్కడ పోటీలో ఉంటామో స్పష్టత లేకపోవడంతో వామపక్షాల నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రచారానికి తగిన సమయం ఉండదని అంటున్నాయి. అంతేకాదు పొత్తులపై తమ కేడర్‌కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నా మని చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపోతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. బీఎల్ఎఫ్ రెండో జాబితా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ఆ పార్టీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులను బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకా‹శ్ ప్రకటించారు. ఇల్లెందు బరిలో గుమ్మడి అనురాధ గతంలో ఇల్లెందు నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అనురాధ ఉస్మానియా లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తనకు న్యూడెమొక్రసీ, ప్రజాపంథా సహా పలు సీపీఐ (ఎంఎల్) పార్టీల మద్దతు ఉన్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే బలమైన తండ్రి వారస త్వం ఆమెకు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
అక్కడ ‘కారు’ జోరు పెరుగుతుందా?.. ఆ ఇద్దరు కీలక నేతల పరిస్థితేంటి?
సాక్షి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కారు జోరు పెరుగుతుందా? లేక ముచ్చటగా మూడోసారి కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందా? ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారిన ఆ ఇద్దరు కీలక నేతల పరిస్థితేంటి? క్యాడర్ ఉండి లీడర్లు లేని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగలుగుతుందా? జిల్లాలో బీజేపీ బోణీ కొడుతుందా? కామ్రేడ్లు పూర్తిగా కనుమరుగైనట్లేనా? ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఫోకస్.. చదవండి: మల్లారెడ్డా మజాకా.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లా రాజకీయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకప్పుడు ఎరుపు కాంతులతో మెరిసిన కామ్రేడ్లు ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతున్నారు. గత రెండు ఎన్నికలు అధికార టీఆర్ఏస్ కు కూడా కలిసిరాలేదు. రాష్ట్రం అంతా గులాబీ గాలి వీచినా ఖమ్మం జిల్లాలో సీన్ రివర్స్ అయింది. అన్ని జిల్లాల్లో ఘోరమైన ఫలితాలు తెచ్చుకున్న కాంగ్రెస్ ఖమ్మంలో మాత్రం ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కేయడంతో కార్యకర్తల కష్టానికి విలువ లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. బీజేపీ ప్రభావం జిల్లాలో అంతంత మాత్రంగానే ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఎవరైనా బీజేపీలో చేరితే తప్ప కాషాయ పార్టీ జిల్లాలో సత్తా చాటే పరిస్థితులు కనిపించడంలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు గెలుపొందగా.. 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు ఓటమి పాలవడంతో పువ్వాడ అజయ్ కుమార్‌ను మంత్రి పదవి వరించింది. అజయ్ కుమార్ పై పోటి చేసి ఓడిన నామా నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరి ఖమ్మం ఎంపీ టికెట్ తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్థి రేణకా చౌదరిపై గెలుపోందారు. ఎంపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి పార్టీ విషయంలో అసంతృప్తిగా ఉంటున్నారు. పొంగులేటితో పాటు తుమ్మల నాగేశ్వరరావు సైతం కారులో ఇబ్బందికరమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సైతం తుమ్మల, పొంగులేటిని పార్టీ నుంచి వెళ్లనీయకుండా బుజ్జగించే ప్రయత్నాలు చేయడంతో వారు తాత్కాలికంగా పార్టీ మార్పునకు బ్రేక్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి జరిగిన సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారంతో పాటు వనమా రాఘవ ఎపిసోడ్ అధికార పార్టీని డ్యామేజ్ చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో.. వనమా రాఘవ కీలక నిందితుడు కావడంతో ఆయన తండ్రి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ జిల్లాలో పెద్ద ఎత్తున వినిపించింది. ఇది స్థానికంగా అధికార పార్టీకి మైనస్ కావడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తంగా ఎఫెక్ట్ పడే పరిస్థితిని తీసుకువచ్చింది. ఖమ్మం టౌన్లో జరిగిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ సూసైడ్ ఘటన మంత్రి అజయ్ కుమార్‌ను చిక్కుల్లో పడే విధంగా చేసింది. తన చావుకు కారణం మంత్రి అజయ్ కుమార్ అని గణేష్ మరణ వాంగ్మూలం ఇవ్వడంతో మంత్రిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌తో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఈ రెండు ఘటనలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాయనే చెప్పాలి.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగానే ఉందని చెప్పాలి. అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాడర్ ఉన్నా లీడర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పోదెం వీరయ్య మినహా చెప్పుకోదగ్గ నేతలు ఎవరు లేరనే చెప్పాలి. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ రేణుక చౌదరి ఉన్నా.. ఆమె వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే రేణుకా చౌదరి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కొత్తగూడెం నుంచి ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పాలేరు, వైరా, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నియోజకవర్గ ఇంచార్జీలు ఎవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ పుంజుకోవాలంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి నేతలు చేరితే తప్ప జిల్లాలో కమలదళం ప్రభావం చూపే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ వంటి నేతలు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. కాంగ్రెస్, టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. టీఆర్ఎస్ నుంచి అసంతృఫ్త నేతలు ఎవరైనా బీజేపీ కండువా కప్పుకుంటే తప్ప జిల్లాలో బీజేపీ బోణీ కోట్టే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. ఒకప్పుడు జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న చరిత్ర ఉన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాలక్రమంలో పూర్తిగా కనుమరుగయ్యే స్థితికి చేరాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే సమయంలో టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు సాగితేనే జిల్లాలో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. లేకుంటే కాంగ్రెస్, కారు పార్టీల మధ్య ముఖాముఖీ పోటీనే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
జీ ప్లస్ వన్ జగడం
* సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన * 1+1 స్కీం రద్దు చేయాలని డిమాండ్ * దీన్‌దయాళ్‌నగర్‌లో అధికారుల ఘెరావ్ * ఉధృతమవుతున్న ఆందోళనలు కలెక్టరేట్‌ను ముట్టడించిన కామ్రేడ్లు నక్కలగుట్ట : ప్రభుత్వం గుడిసెవాసుల కోసం జారీ చేసిన 58 జీఓను అమలు చేయాలని, 1+1 స్కీంను గుడిసెవాసులకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం 28 వడివిజన్ నాయకులు కారు ఉపేందర్, వేల్పుల సారంగపాణి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నగరంలో కిరాయికి ఉండేవారికి కొత్తగా ఇళ్లు కట్టించాలని, శిఖం, దేవాదాయ, ఇతర భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి అక్కడే పట్టాలు ఇచ్చి, వ్యక్తిగత పక్కాగృహలు కట్టించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో వేసుకున్న నివసిస్తున్న గుడిసెవాసులకు అక్కడే వ్యక్తిగత ఇళ్లు కట్టించాలని, ప్రభుత్వ భూములు రక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో సీపీఎం నాయకులు మునిగాల ప్రవీణ్, ఇనుముల వనమాల, లకావత్ శ్రీనివాస్ పాల్గొన్నారు. గుడిసెవాసులందరికీ పట్టాలివ్వాలి పోచమ్మమైదాన్ : నగరంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారందరికి పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు తమ ఉద్యమం ఆగదని సీపీఎం జిల్లా నాయకుడు మెట్టు శ్రీనివాస్ హెచ్చరించారు. నగరంలోని ఎంహెచ్ నగర్, లెనిన్ నగర్, చింతల్, ఆర్ఎస్ నగర్, మైసయ్య నగర్, నాన్మియా, గణపతి నగర్, దొడ్డి కొమురయ్య నగర్ కు చెందిన గుడిసెవాసులతో వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. వన్ ప్లస్ వన్ వద్దు అని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జీఓ 58ని ప్రకారం గుడిసెవాసులందరికి పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు మర్రి శ్రీనివాస్, బోగి సురేష్, యాదగిరి, రామస్వామి, పల్లం రవి, ప్రవీణ్, బషీర్, అన్నపూర్ణ, మేరుగు అశోక్, కమలాకర్, రమేష్, స్వామి పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో... నగరంలోని రాజ్నారాయణనగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ వరంగల్ తహసీల్దార్ రవికి సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరగంటి సదానందం మాట్లాడుతూ 15 ఏళ్లుగా రాజ్నారాయణనగర్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారికి పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాల న్నారు. నాయకులు శ్రీనివాస్, పెసర ఉపేందర్, రవి, మస్క సుధాకర్ పాల్గొన్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తుల వెల్లువ.. నక్కలగుట్ట : నగరంలోని గుడిసెవాసులతో కలెక్టరేట్, హన్మకొండ తహ సీల్దార్ కార్యాలయూలు శనివారం కిక్కిరిశాయి. ఇటీవల తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలతో కూడిన ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చాలాకాలంగా ప్రభుత్వ భూముల్లో 125 గజాల్లోపు స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారు ఆ స్థలాలను ఉచితంగా రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గుడిసెవాసులు శనివారం పెద్దఎత్తున హన్మకొండ తహసీల్దార్ కార్యాలయూనికి చేరుకున్నారు. దీంతో ఆ కార్యాలయంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కరోజే రెండు వేలకుపైగా దరఖాస్తులు : చెన్నయ్య, తహసీల్దార్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గుడిసెవాసుల నుంచి శుక్రవారం 650 దరఖాస్తులు రాగా, శనివారం రెండు వేలకుపైగా దరఖాస్తులు స్వీకరించాం. ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, అసైన్డ్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను వారి దరఖాస్తు ఆధారంగా పరిశీలించి, వారు అర్హులయితే రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం. ధనికులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివసిస్తున్నట్లయితే వారిని ఖాళీ చేయిస్తాం. ఇటీవల ముఖ్యమంత్రి 1166 ఇళ్లను పరిశీలించారు. ఆ ఇళ్లకు సంబంధించిన సర్వే వివరాలు, లేఅవుట్‌ను సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ చేస్తాం. దరఖాస్తు గడువు పొడిగించాలి నగరంలో ఉన్న గుడిసెవాసుల ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ గడువును ఈ నెలాఖరు వరకు పొడగించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్, డివిజనల్ రైల్వే యూజర్ కన్సల్టేటీవ్ కమిటీ సభ్యులు ఉల్లెంగుల యాదగిరి కోరారు. ఇప్పటికే నగరంలో ఉన్న గుడిసెవాసులు చాలామంది పండుగలకు గ్రామాలకు వెళ్లారని, వరుస సెలవులతో కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు. హన్మకొండలోని దీన్‌దయాళ్‌నగర్, జితేందర్‌సింగ్ నగర్లో వన్ ప్లస్ వన్ నిర్మాణాల ప్లాన్‌ను చూపించి అంగీకార పత్రాలు స్వీకరించేందుకు వెళ్లిన అధికారులను స్థానిక గుడిసె వాసులు ఘెరావ్ చేశారు. తమ స్థలాలకు పట్టాలు జారీ చేసి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, వన్ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దని నినాదాలు చేశారు. ‘కుంట’లో అంగీకార పత్రాల స్వీకరణ కరీమాబాద్ : అండర్ రైల్వేగేటు ప్రాంతంలోని సాకరాసికుంటలో హౌసింగ్ ఈఈ వసంతరావు ఆధ్వర్యంలో ఏఈలు దుర్గాప్రసాద్, సమ్మయ్య ఇంటింటికి తిరుగుతూ వన్ ప్లస్ వన్ గృహాలు నిర్మించుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని వారి నుంచి కాన్సెంట్ తీసుకున్నారు. అలాగే వారి ఆధార్, రేషన్‌కార్డులు, ఇంటి నంబర్లు పరిశీ లించారు. అనంతరం ఇంటి ప్లాన్‌ను వారికిచ్చారు. ఇక్కడ 30 నుంచి 40 గజాల్లోపు స్థలాల్లో నివసిస్తున్నారని, వారం తా వన్ ప్లస్ వన్ నిర్మాణాలకు ముందుకొస్తున్నట్లు ఈఈ చెప్పారు. 17 డబ్ల్యూజీఎల్ 101 : గృహ నిర్మాణాలు చేపట్టాలని కాన్సెంట్ తెలుపుతున్న సాకరాసికుంట వాసులు లక్ష్మీపురంలో సంతకాల సేకరణ కాశిబుగ్గ : నగరంలోని ఐదో డివిజన్లోని లక్ష్మీపురంలో గందరగోళం మధ్య హౌసింగ్ ఇంజనీర్లు, సిబ్బంది సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు వన్ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణా లు ఎలా ఉంటాయనే మ్యాపులను చూపుతూ వారికి అవగాహన కల్పించారు. అయితే కొన్ని విషయాలపై గుడిసెవాసులు నిరసన వ్యక్తం చేశారు. వారి సందేహాలను నివృత్తి చేస్తూనే సుమారు 80 శాతం మంది స్థానికులను ఒప్పించి, సంతకాలు చేయించగలిగారు. బృందంలో హౌసింగ్ ఈఈ రమేష్, డీఈ రంగమూర్తి, ఏఈ రాజమౌళి, సిబ్బంది ఉన్నారు. -
బాబు తీరుపై కామ్రేడ్ల కన్నెర్ర
రాజంపేట : జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపుతున్న వివక్షను ఎండగడుతూ రాజంపేటలో కామ్రేడ్లు మంగళవారం ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లాపై చూపుతున్న పక్షపాత ధోరణిని మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముక్తకంఠంతో హెచ్చరించారు. జిల్లా సమగ్రాభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ, ఆటో కార్మిక సంఘం, ఏఐఎస్ఎఫ్, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నానుద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడారు. జిల్లాలో నిరుద్యోగుల భవిష్యత్ కోసం సెయిల్ ఆధ్వర్యంలో తక్షణం ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రచందనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ కేంద్రంతో పాటు ఉపాధి ఆధారిత పరిశ్రమను రాజంపేటలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు, డ్వాక్రా సంఘాల రుణాలను తక్షణం మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి మహేశ్, ఏఐటీఎస్ సీనియర్ నాయకుడు రాయుడు, మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి సులోచనమ్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుడు శివరామకృష్ణ దేవరా, జిల్లా సహాయ కార్యదర్శి సురేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్, ఆటో వర్కర్స్ యూనియర్ అధ్యక్షుడు బలిజిపల్లె శ్రీనివాసులు మాట్లాడారు. -
నిండా పదేళ్లు దాటకున్నా..నిజాంపై పోరాడింది
సాక్షి, హైదరాబాద్ : నిండా పదేళ్లు దాటని ఓ బాలిక ఆమె.. నిజాం నిరంకుశ పాలనపై ఊరంతా చేతిలో కర్రలు పుచ్చుకొని పోరాటం చేస్తుంటే తానెందుకు ఇంట్లో కూర్చోవాలని భావించి.. తానూ చేతిలో జెండా పట్టుకొని చుట్టుపక్కల పిల్లలను పోగేసుకొని పోరాటానికి సిద్ధమైంది. దీంతో 12 ఏళ్ల వయస్సులో ఆ బాలికను నిజాం ప్రభుత్వ పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజులు జైల్లో ఉంచి విడిచిపెట్టారు. అయినాసరే ఆమె అదరలేదు.. బెదరలేదు. జైలు నుంచి నేరుగా వీధిలోకే వచ్చి మళ్లీ పోలీసుల ముందే నిజాంకు వ్యతిరేకంగా నినదించింది. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కడవెండి గ్రామానికి చెందిన నల్ల వజ్రమ్మ ఆనాటి స్మతులను నెమరువేసుకుంటూ ఆ రోజులు చాలా బాగుండేవి బిడ్డా.. అంటూ తనగతాన్ని విప్పి చెప్పింది. హైదరాబాద్‌లో తెలంగాణ సాయుధ పోరాటం వార్షికోత్సవాలకు ఆమె విచ్చేసి తాను చేసిన పోరాటాన్ని చెప్పింది. 13 ఏళ్ల వయసులో ఆమెకు మరో పోరాట యోధుడు నల్ల నర్సింహులుతో వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. నల్లమల అడవుల్లో రోజూ గంటపాటు గుట్టమీద గార్డు డ్యూటీ చేసే పనిని కామ్రేడ్లు ఆమెకు అప్పగించారు. చేతిలో పిస్టల్, సంచిలో బాంబు పెట్టుకొని గుట్టపైకి పోలీసులు వస్తే సమాచారం ఇచ్చేందుకు గార్డుగా రెండేళ్లపాటు విధులు నిర్వహించింది. ఆ సమయంలో వారానికి ఒక్కసారి మాత్రమే తిండి దొరికేది. మంచినీళ్లు తాగుదామంటే నీటి గుంతలవద్ద పోలీసులు కాపలా ఉండేవారు. చెంచులు, కోయలు తమకు అన్నం పెడుతున్నారని తెలిసి పోలీసులు వారిని అడవి అవతలికి తరిమేసి గుడిసెలు వేయించారు. కడుపు నకనకలాడుతున్నా లక్ష్యాన్ని విడవకుండా ఉద్యమంలో పాల్గొన్నామంటూ ఆమె చెప్పుకొచ్చింది. గర్భందాల్చిన తరువాత కూడా ఉద్యమాన్ని వదల్లేదు. 9వ నెల కడుపుతో ఉండగానే గార్డు డ్యూటీ నిర్వహిస్తుండగాా పురిటినొప్పులు రావడంతో సహచర కామ్రేడ్లు ఆమెను మోసుకొని సమీపంలో ఉన్న క్రిస్టియన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను ప్రసవించిన గంటకే నిజాం పోలీసులు ఆమెను అరెస్టు చేసి ముషీరాబాద్ జైలుకు తరలించారు. ఆర్నెళ్లు ఆమె పసికందుతో జైలులోనే గడిపింది. విడుదలయ్యాక కూతురిని ఇంట్లోనే వదిలి మళ్లీ ఉద్యమం బాట పట్టింది. ఈసారి రెండేళ్ల పాటు ఆమెను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలులో ఉంచారు. అరెస్టులకు తాను ఏనాడూ భయపడలేదన్న వజ్రమ్మ ఇప్పుడు 86 ఏళ్ల వయస్సులోనూ ఉద్యమమంటే చేతిలో జెండా పట్టుకొని ముందుకు నడవాలని అనిపిస్తుందని చెప్పింది. చాలా మంది దొంగ సర్టిఫికెట్లు పెట్టి స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు తీసుకుంటుంటే ఆమె మాత్రం పింఛన్‌కు ససేమిరా ఒప్పుకోలేదు. భర్త చనిపోయాక బతుకు భారమై తిండికి కూడా నోచుకోని పరిస్థితుల్లో మిగతా కామ్రేడ్లు ఆమెను ఒప్పించి పింఛన్ తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఈ మధ్య కాలంలోనే నెలకు రూ. 10 వేల పింఛన్ వస్తుందని దాంతోనే బతుకు వెల్లదీస్తున్నానని వజ్రమ్మ వెల్లడించింది.