జీ ప్లస్ వన్ జగడం | G Plus One affray | Sakshi
Sakshi News home page

జీ ప్లస్ వన్ జగడం

Published Sun, Jan 18 2015 5:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

జీ ప్లస్ వన్ జగడం

జీ ప్లస్ వన్ జగడం

* సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
* 1+1 స్కీం రద్దు చేయాలని డిమాండ్
* దీన్‌దయాళ్‌నగర్‌లో అధికారుల ఘెరావ్
* ఉధృతమవుతున్న ఆందోళనలు
కలెక్టరేట్‌ను ముట్టడించిన కామ్రేడ్లు

నక్కలగుట్ట : ప్రభుత్వం గుడిసెవాసుల కోసం జారీ చేసిన 58 జీఓను అమలు చేయాలని, 1+1 స్కీంను గుడిసెవాసులకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం 28 వడివిజన్ నాయకులు కారు ఉపేందర్, వేల్పుల సారంగపాణి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నగరంలో కిరాయికి ఉండేవారికి కొత్తగా ఇళ్లు కట్టించాలని, శిఖం, దేవాదాయ, ఇతర భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి అక్కడే పట్టాలు ఇచ్చి, వ్యక్తిగత పక్కాగృహలు కట్టించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూముల్లో వేసుకున్న నివసిస్తున్న గుడిసెవాసులకు అక్కడే వ్యక్తిగత ఇళ్లు కట్టించాలని, ప్రభుత్వ భూములు రక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ధర్నాలో సీపీఎం నాయకులు మునిగాల ప్రవీణ్, ఇనుముల వనమాల, లకావత్ శ్రీనివాస్ పాల్గొన్నారు.  
 
గుడిసెవాసులందరికీ పట్టాలివ్వాలి
పోచమ్మమైదాన్ : నగరంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారందరికి పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు తమ ఉద్యమం ఆగదని సీపీఎం జిల్లా నాయకుడు మెట్టు శ్రీనివాస్ హెచ్చరించారు. నగరంలోని ఎంహెచ్ నగర్, లెనిన్ నగర్, చింతల్, ఆర్‌ఎస్ నగర్, మైసయ్య నగర్, నాన్‌మియా, గణపతి నగర్, దొడ్డి కొమురయ్య నగర్ కు చెందిన గుడిసెవాసులతో వరంగల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు.

వన్ ప్లస్ వన్ వద్దు అని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జీఓ 58ని ప్రకారం గుడిసెవాసులందరికి పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు మర్రి శ్రీనివాస్, బోగి సురేష్, యాదగిరి, రామస్వామి, పల్లం రవి, ప్రవీణ్, బషీర్, అన్నపూర్ణ, మేరుగు అశోక్, కమలాకర్, రమేష్, స్వామి పాల్గొన్నారు.
 
సీపీఐ ఆధ్వర్యంలో...
నగరంలోని రాజ్‌నారాయణనగర్ గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ వరంగల్ తహసీల్దార్ రవికి సీపీఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరగంటి సదానందం మాట్లాడుతూ 15 ఏళ్లుగా రాజ్‌నారాయణనగర్‌లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారికి పట్టాలిచ్చి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాల న్నారు. నాయకులు  శ్రీనివాస్, పెసర ఉపేందర్, రవి, మస్క సుధాకర్ పాల్గొన్నారు.
 
క్రమబద్ధీకరణకు దరఖాస్తుల వెల్లువ..
నక్కలగుట్ట : నగరంలోని గుడిసెవాసులతో కలెక్టరేట్, హన్మకొండ తహ సీల్దార్ కార్యాలయూలు శనివారం కిక్కిరిశాయి. ఇటీవల తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలతో కూడిన ఆక్రమణలను క్రమబద్ధీకరించడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చాలాకాలంగా ప్రభుత్వ భూముల్లో 125 గజాల్లోపు స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న వారు ఆ స్థలాలను ఉచితంగా రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గుడిసెవాసులు శనివారం పెద్దఎత్తున హన్మకొండ తహసీల్దార్ కార్యాలయూనికి చేరుకున్నారు. దీంతో ఆ కార్యాలయంలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఒక్కరోజే రెండు వేలకుపైగా దరఖాస్తులు : చెన్నయ్య, తహసీల్దార్
నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గుడిసెవాసుల నుంచి శుక్రవారం 650 దరఖాస్తులు రాగా, శనివారం రెండు వేలకుపైగా దరఖాస్తులు స్వీకరించాం. ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, అసైన్డ్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను వారి దరఖాస్తు ఆధారంగా పరిశీలించి, వారు అర్హులయితే రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం.

ధనికులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివసిస్తున్నట్లయితే వారిని ఖాళీ చేయిస్తాం. ఇటీవల ముఖ్యమంత్రి 1166 ఇళ్లను పరిశీలించారు. ఆ ఇళ్లకు సంబంధించిన సర్వే వివరాలు, లేఅవుట్‌ను సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ చేస్తాం.
 
దరఖాస్తు గడువు పొడిగించాలి
నగరంలో ఉన్న గుడిసెవాసుల ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ గడువును ఈ నెలాఖరు వరకు పొడగించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్, డివిజనల్ రైల్వే యూజర్ కన్సల్‌టేటీవ్ కమిటీ సభ్యులు ఉల్లెంగుల యాదగిరి కోరారు. ఇప్పటికే నగరంలో ఉన్న గుడిసెవాసులు చాలామంది పండుగలకు గ్రామాలకు వెళ్లారని, వరుస సెలవులతో కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలిపారు.
 
హన్మకొండలోని దీన్‌దయాళ్‌నగర్,  జితేందర్‌సింగ్ నగర్‌లో వన్ ప్లస్ వన్ నిర్మాణాల ప్లాన్‌ను చూపించి అంగీకార పత్రాలు స్వీకరించేందుకు వెళ్లిన అధికారులను స్థానిక గుడిసె వాసులు ఘెరావ్ చేశారు. తమ స్థలాలకు పట్టాలు జారీ చేసి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, వన్ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దని నినాదాలు చేశారు.  
 
‘కుంట’లో అంగీకార పత్రాల స్వీకరణ
కరీమాబాద్ : అండర్ రైల్వేగేటు ప్రాంతంలోని సాకరాసికుంటలో హౌసింగ్ ఈఈ వసంతరావు ఆధ్వర్యంలో ఏఈలు దుర్గాప్రసాద్, సమ్మయ్య ఇంటింటికి తిరుగుతూ వన్ ప్లస్ వన్ గృహాలు నిర్మించుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని వారి నుంచి కాన్సెంట్ తీసుకున్నారు. అలాగే వారి ఆధార్, రేషన్‌కార్డులు, ఇంటి నంబర్లు పరిశీ లించారు. అనంతరం ఇంటి ప్లాన్‌ను వారికిచ్చారు. ఇక్కడ 30 నుంచి 40 గజాల్లోపు స్థలాల్లో నివసిస్తున్నారని, వారం తా వన్ ప్లస్ వన్ నిర్మాణాలకు ముందుకొస్తున్నట్లు ఈఈ చెప్పారు.
17 డబ్ల్యూజీఎల్ 101 : గృహ నిర్మాణాలు చేపట్టాలని కాన్సెంట్ తెలుపుతున్న సాకరాసికుంట వాసులు
 
లక్ష్మీపురంలో సంతకాల సేకరణ
కాశిబుగ్గ : నగరంలోని ఐదో డివిజన్‌లోని లక్ష్మీపురంలో గందరగోళం మధ్య హౌసింగ్ ఇంజనీర్లు, సిబ్బంది సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు వన్ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణా లు ఎలా ఉంటాయనే మ్యాపులను చూపుతూ వారికి అవగాహన కల్పించారు. అయితే కొన్ని విషయాలపై గుడిసెవాసులు నిరసన వ్యక్తం చేశారు. వారి సందేహాలను నివృత్తి చేస్తూనే సుమారు  80 శాతం మంది స్థానికులను ఒప్పించి, సంతకాలు చేయించగలిగారు. బృందంలో హౌసింగ్ ఈఈ రమేష్, డీఈ రంగమూర్తి, ఏఈ రాజమౌళి, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement