సాక్షి, తాడేపల్లి: తెలంగాణ మంత్రి హరీష్ రావుపై మంత్రి బొత్స సత్యానారాయణ సీరియస్ అయ్యారు. హరీష్‌రావు బాధ్యతగా మాట్లాడాలి అని హితవు పలికారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
కాగా, బొత్స సత్యనారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను మేం మొదటి నుంచి వ్యతిరేకించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. ప్రైవేటీకరణను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు భూములు దోచుకున్నారు. సీఎం జగన్ పాలనలో ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా వైఎస్ జగనే సీఎం అవుతారు.
తెలంగాణ మంత్రి హరీష్ రావు బాధ్యతగా మాట్లాడాలి. బీఆర్‌ఎస్ వల్లే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనడం హాస్యాస్పందం. బీఆర్‌ఎస్ ఎప్పుడు పుట్టింది.. రెండు స్టేట్‌మెంట్లు ఇస్తే సరిపోతుందా. మధ్యలో వచ్చి మా వల్లే ఆగింది అంటుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడటం మానుకోండి. కేంద్రాన్ని బీఆర్‌ఎస్ ఏం నిలదీసింది. ఏపీలో జరుగుతున్న సంక్షేమం తెలంగాణలో ఎందుకు జరగడం లేదు’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment