ఆ అవినీతిపరుడే గొప్పవాడయ్యారా?: సీఎం వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

ఆ అవినీతిపరుడే గొప్పవాడయ్యారా?: సీఎం వైఎస్‌ జగన్‌

Published Wed, May 8 2024 4:37 AM

YS Jagan Mohan Reddy comments over chandrababu and modi

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అన్నది ప్రధాని మోదీనే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ఈ 2024 డ్రామాలో హామీలేమిటి?.. హోదా ఇస్తారా?  

ఐదేళ్లుగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిందంటే.. జగన్‌ అనే సీఎం ఒప్పుకోలేదు కాబట్టే 

రెండు బిల్డింగ్‌లు కడితే రైల్వే జోన్‌ కాదు 

టీడీపీకి ఓటేస్తే.. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి  ఓటేసినట్లే..

సాక్షి, విశాఖపట్నం :  పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చు­కు­న్నారని స్వయంగా ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఆరోపించారు. మరిప్పుడు చంద్రబాబు ఎలా మంచోడయ్యాడో అర్థం కావట్లేదు. ప్రధాని మోదీ మాటలు వింటుంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? అని బాధగా ఉంది. తిట్టిన వారి చంకనెక్కే విద్యలో చంద్రబాబు నిపుణుడు. మీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగింది.

గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే.. ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఎవరూ ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే?.. వాళ్లు దీన్నే ఎన్నికల రిఫరెండంగా తీసుకుంటారు! స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి ప్రజలంతా మద్దతు తెలిపారు కాబట్టే టీడీపీ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడని చెబుతారు! ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా.

చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలసి ఆడుతున్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి? అని అడుగుతున్నా. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా? పోనీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం చేయబోమని జట్టు కట్టారా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశి్నంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ.. 

అవినీతిపరుడని అన్న నోటితోనే.. 
విచిత్రం ఏమిటంటే.. మనం ఇంతగా అభివృద్ధి బాటలో కనిపిస్తుంటే నిన్న సభలో ప్రధాని మోదీ గారు చేసిన విమర్శలు చూస్తుంటే గత ఎన్నికల్లో చంద్రబాబు గురించి ఆయన ఏమన్నారో గుర్తు తెచ్చుకోమని కోరుతున్నా. పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు గురించి చెప్పలేదా? చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇవాళ ఇదే మోదీగారు మళ్లీ ఇవాళ బాబు తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడంటున్నారు.

 అంటే.. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలని కోరుతున్నా. వారితో ఉంటే ఒకలా.. లేదంటే మరోలా మాటలు మారుస్తున్నారంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలి. చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి? అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఏమైనా ఇస్తామని జట్టు కట్టారా? పోనీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం చేయబోమని జట్టు కట్టారా? 

జగన్‌ ఆమోదం లేదు కాబట్టే ఆగింది.. 
మీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసింది. ఐదేళ్లుగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగలేదంటే దానికి కారణం జగన్‌ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టే! ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని కోరుతున్నా. స్టీల్‌ ప్లాంట్‌ విక్రయాన్ని ఆపేలా ఈ ఎన్నికల్లో ఆ బాబు, దత్తపుత్రుడు, బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడ నుంచి పంపాలని కోరుతున్నా.

గాజువాకలో టీడీపీకి ఓటు.. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి ఓటేసినట్టే 
గాజువాకలో మీరు టీడీపీకి ఓటు వేయడం అంటే దాని అర్థం.. ప్రైవేటైజేషన్‌ చేస్తామని అంటున్న ఎన్డీఏకి ఓటు వేయడమే. అంటే.. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నా.

గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే, ఎన్డీఏ గెలిచిందంటే.. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపడం సాధ్యం కాదు. దీన్ని రిఫరెండంగా తీసుకుంటారు. ఆ తర్వాత దీన్ని ఆపడానికి జగన్‌ ఎంత ప్రయత్నం చేసినా ‘‘నీకెందుకయ్యా బాధ? వాళ్లకు లేని బాధ నీకెందుకు? ఎన్డీఏకి ఓటు వేశారంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి వారంతా గ్రీ¯న్‌ సిగ్నల్‌ ఇచి్చనట్లే కదయ్యా..! మరి నీకెందుకయ్యా బాధ?’’ అని అంటారని గుర్తు పెట్టుకోండి.


రెండు బిల్డింగ్‌లు కడితే రైల్వే జోన్‌ కాదు.. 
రైల్వే జోన్‌కు మనం భూములు ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్‌ పెడుతున్నారు. రైల్వే జోన్‌కు అర్థం.. ఆరి్థకంగా నిలబడగలిగిన జోన్‌ అని. కేవలం రెండు బిల్డింగులు కట్టి మమ.. అనిపించడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్లు మనమీద చూపిస్తున్నదని దొంగ ప్రేమేనని గమనించాలని కోరుతున్నా. తిట్టిన వారి చంకనెక్కడం లాంటి విద్యల్లో చంద్రబాబు నిపుణుడు.

Advertisement
Advertisement