పెదవాల్తేరు(విశాఖ తూర్పు)/సింహాచలం(పెందుర్తి): విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. ఆది వారం విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌కు గత ప్రభు త్వాలు గనులు ఇవ్వకపోవడం వల్లే ఈ పరి స్థితి తలెత్తిందన్నారు. ఆర్థిక అత్యవసర పరి స్థితి విధించే దిశగా ఏపీ పయనిస్తోందని వి మర్శించారు.
మద్యంపై భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని హామీగా చూపి.. ప్రభుత్వం రుణాలు తీసుకోవడం దారుణమన్నారు. కోవిడ్ వల్ల అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పడం సరికాదన్నారు. గత టీడీపీ ప్రభు త్వమే ప్రత్యేక హోదా వద్దని చెప్పిందన్నారు. కాగా, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తోందని దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. సింహాచలంలో ఆమె మాట్లాడారు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం జిల్లాగా ఉండాలనేది బీజేపీ ప్రతిపాద న కూడా అని ఆమె పేర్కొన్నారు. మార్కా పురం, రాజంపేటలకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో కొత్త ఉద్యోగాలు
Published Mon, Feb 28 2022 5:37 AM | Last Updated on Mon, Feb 28 2022 5:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment