
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల సానుకూలంగా ఉందని.. ప్రజాభిప్రాయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌పై ప్రకటన చేసిన తర్వాత తమకు తెలిసిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో విశాఖ వాసులకు, రాష్ట్ర ప్రజలకు విడదీయని బంధం ఉందన్నారు. ప్రైవేటీకరణ నిలుపుదల కోసం ప్రయత్నం చేస్తానని ఆమె తెలిపారు.