సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని చెప్పారు. కొత్తగూడెంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.
సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. అక్కడ సీపీఐ నేతలతో రేవంత్ చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్-సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సీపీఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారితో కూడా పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు..కూనంనేని
కాంగ్రెస్‌కు తెలంగాణలో సానుకూల పవనాలు వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడులో కేవలం బీజేపీని ఓడించడానికే బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. కేంద్రంలో నిరంకుశ పాలన ఉందని, అదే స్థాయిలో తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలన ఉందని విమర్శించారు. సీపీఎంతో కూడా కాంగ్రెస్‌కు ఒక అవగాహన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌తో ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని కూనంనేని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment