సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆప్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది. ఇదే సమయంలో మరో మూడు జాతీయ హోదా కలిగిన పార్టీలకు షాకిచ్చింది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. ఇక, ఏపీలో బీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది.
అయితే, 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది.
Election Commission of India recognises Aam Aadmi Party (AAP) as a national party.
— ANI (@ANI) April 10, 2023
Election Commission of India derecognises CPI and TMC as national parties. pic.twitter.com/9ACJvofqj6
Comments
Please login to add a commentAdd a comment