national party status
-
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి?
న్యూఢిల్లీ: సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ఇచ్చింది. అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి? ఎన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు పొంది ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లైనా గెలవాలి. లేదా లోక్‌సభలో రెండు శాతం సీట్లు కలిగిఉండాలి. కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఉండాలి. వీటిలో ఏ అర్హత ఉన్నా ఎన్నికల సంఘం ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ,ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తగా జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజ యం సాధించింది. 1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. శరద్‌పవార్ 1999 లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్స రంలో జాతీయ హోదా లభించింది. చదవండి: రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో? -
EC: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆప్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది. ఇదే సమయంలో మరో మూడు జాతీయ హోదా కలిగిన పార్టీలకు షాకిచ్చింది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. ఇక, ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. అయితే, 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది. Election Commission of India recognises Aam Aadmi Party (AAP) as a national party. Election Commission of India derecognises CPI and TMC as national parties. pic.twitter.com/9ACJvofqj6 — ANI (@ANI) April 10, 2023 -
NCP: జాతీయ పార్టీ హోదా కోల్పోనున్న పవార్ పార్టీ?
న్యూఢిల్లీ: సీనియర్ పొలిటీషియన్ శరద్ పవార్‌కు షాక్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైందా?. ఆయన స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి ఉన్న జాతీయ పార్టీ హోదాను పునఃపరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. జాతీయ హోదా రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ అంశంపై ఎన్సీపీ నుంచి ప్రతినిధి వివరణ కోరింది ఈసీ. ఒకవేళ ఎన్సీపీ ప్రతినిధి ఇచ్చిన వివరణను.. ఈసీ అంగీకరించని పక్షంలో పవార్ పార్టీకి షాక్ తగలనుంది. జాతీయ పార్టీ హోదాను కోల్పోతుంది ఎన్సీపీ. అప్పుడు అది ఒక ప్రాంతీయ పార్టీగానే.. వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందంతే. జాతీయ పార్టీ హోదా కారణాంగా.. అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పలు రాష్ట్రాలలో పార్టీకి ఉమ్మడి గుర్తు, న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలంతో పాటు ఎన్నికల సమయంలో ఉచితంగా పబ్లిక్ బ్రాడ్కాస్టర్లలో ప్రసార సమయం లభిస్తాయి. ఎన్నికల సంఘం 2016లో రాజకీయ పార్టీల జాతీయ పార్టీ హోదా స్థితిని సమీక్షించే విధానాన్ని సవరించింది. అప్పటిదాకా ఐదు సంవత్సరాలకొకసారి సమీక్షిస్తుండగా.. దానిని ప్రతి 10 సంవత్సరాలకు సమీక్షించేలా రూల్స్ మార్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. ఎన్సీపీతో పాటు సీపీఐ, టీఎంసీల జాతీయ పార్టీ హోదా వ్యవహారం ఎన్నికల సంఘం ముందు సమీక్షకు వచ్చింది. అయితే అప్పటి నుంచి వరుసగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో.. యథాతథ స్థితిని కొనసాగించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పుడు ఆ అంశమే మళ్లీ తెర మీదకు వచ్చింది. సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం.. జాతీయ హోదాను కోల్పోయిన పార్టీకి దేశవ్యాప్తంగా ఉమ్మడి గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. 1999 జూన్ 10వ తేదీన ఆవిర్భవించింది. శరద్ పవార్, పీఏ సంగ్మా, తారీఖ్ అన్వర్లు ఈ పార్టీ వ్యవస్థాపకులు. సోనియా గాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ నేతలైనా ఈ ముగ్గురు తిరుగుబావుటా ఎగరేయడంతో పార్టీ వీళ్లను బహిష్కరించింది. ఆపై వీళ్లు ఎన్సీపీని స్థాపించగా.. అటుపై ఇండియన్ కాంగ్రెస్(సోషలిస్ట్)-శరత్ చంద్ర సిన్హా పార్టీ, ఎన్సీపీలో విలీనం అయ్యింది. మహారాష్ట్రలో ఎన్సీపీ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అలారం క్లాక్ ఈ పార్టీ గుర్తు. త్రివర్ణ పతాకం మధ్యలో అలారం క్లాక్.. పార్టీ జెండాగా ఉంది. జాతీయ స్థాయిలో యూపీఏతో పొత్తు నడిపించిన ఈ పార్టీ.. కేరళలో ఎల్డీఎఫ్Left Democratic Front, మహారాష్ట్రలో Maha Vikas Aghadi కూటమి, యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, జార్ఖండ్‌లో మహాఘట్బంధన్, నాగాలాండ్‌లో ఎన్డీపీపీతో పొత్తు సాగిస్తోంది. ఒక పార్టీ.. రాష్ట్ర/ప్రాంతీయ పార్టీ గుర్తింపు ఉండాలంటే.. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలి. లేదంటే లోక్‌సభ ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో 6 శాతం ఓట్లు, ఒక ఎంపీ సీటు సాధించాలి. లేకుంటే.. గత ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో కనీసం మూడు శాతం సీట్లు లేదా మూడు సీట్లు(ఏది ఎక్కువగా అయితే అది)గెలవాల్సి ఉంటుంది. ఇది కాకుంటే.. అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కనీసం 8 శాతం ఓట్లు పొందాలి. ఇలా ఈసీ రూల్స్ ప్రకారం.. ఆ పార్టీ రాష్ట్ర/ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. మరి జాతీయ పార్టీ గుర్తింపు కోసం.. రాష్ట్రంలో క్రియశీలంగా ఉన్న పార్టీ.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే.. ఎన్నికల సంఘం పరిధిలోని అర్హతలను అందుకోవాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి. లేదంటే.. దేశంలోని కనీసం మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ 2 శాతం చొప్పున ఓట్లు పొందాలి. కుదరకుంటే.. సార్వత్రిక ఎన్నికల్లో(అసెంబ్లీ లేదా లోక్‌సభ) నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి కనీసం 4 ఎంపీ సీట్లు సాధించాలి. దేశంలో ప్రస్తుతం 8 జాతీయ పార్టీలు 1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2. భారతీయ జనతా పార్టీ 3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - సీపీఐ 4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) - సీపీఎం 5. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ( నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది కాబట్టి జాతీయ పార్టీగా అవతరించింది) 6. బహుజన్ సమాజ్ పార్టీ 7. నేషనలిస్ట్ కాంగ్రెస్ 8. నేషనల్ పీపుల్స్ పార్టీ ఇదీ చదవండి: సీల్డ్ కవర్ సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం కామెంట్లు ఇవి! -
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రమోషన్
కోల్‌కతా: మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 7వ జాతీయ హోదా కలిగిన పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ ఎన్నికల కమిషన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం జాతీయ పార్టీ హోదా కల్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు జాతీయ పార్టీ హోదాలో కొనసాగుతున్నాయి. జాతీయ పార్టీ హోదా రావడంతో దేశంలో ఎక్కడి నుంచి అయినా తృణమూల్ కాంగ్రెస్ తమ పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీ హోదా ఎందుకు ఇచ్చారంటే.. కనీసం 11 మంది ఎంపీలు లోక్‌సభలో ఉండి, అది కూడా కనీసం 3 రాష్ట్రాల నుంచి ఉంటేనే పార్టీకి జాతీయ హోదా వస్తుంది. లేదా.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 6 శాతం ఓట్లు పొంది ఉండాలి, కనీసం 4 లోక్‌సభ స్థానాలు సాధించి ఉండాలి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ హోదా ఉన్నా కూడా జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లలో రాష్ట్రస్థాయి పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ గుర్తింపుపొందింది. జాతీయ హోదా రావడానికి కావల్సిన చివరి నిబంధనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అర్హత సాధించడంతో జాతీయ ఎన్నికల కమిషన్ ఈ అవకాశం కల్పించింది. -
సీపీఎంకు ఎన్నికల సంఘం ఝలక్?
సీపీఎంకు జాతీయ పార్టీ హోదాను ఉంచాలా.. వద్దా అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఐదేళ్లకోసారి ఎన్నికల్లో వివిధ పార్టీల పరిస్థితిని చూసి ఈ హోదాను నిర్ణయిస్తారు. అయితే ఇక మీదట ప్రతి రెండు ఎన్నికలకు ఒకసారి దీన్ని పరిశీలించాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీ హోదా ఉంటే పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి. జాతీయ మీడియాలో ప్రచారాలకు ఉచిత ఎయిర్‌టైమ్, 40 మంది వీవీఐపీ ప్రచారకర్తలకు ప్రయాణ ఖర్చులను అభ్యర్థి ఎన్నికల ఖర్చు నుంచి మినహాయించడం లాంటి సదుపాయాలు ఉంటాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం తరఫున లోక్‌సభకు కేవలం 9 మంది ఎంపీలే ఎన్నికయ్యారు. హోదా వచ్చేదెలా? కనీసం 11 మంది ఎంపీలు లోక్‌సభలో ఉండి, అది కూడా కనీసం 3 రాష్ట్రాల నుంచి ఉంటేనే పార్టీకి జాతీయ హోదా వస్తుంది. లేదా.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 6 శాతం ఓట్లు పొంది ఉండాలి, కనీసం 4 లోక్‌సభ స్థానాలు సాధించి ఉండాలి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీ హోదా ఉన్నా కూడా జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. సీపీఎం పరిస్థితి ఏంటి ప్రస్తుతం కేవలం పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర.. ఈ మూడు రాష్ట్రాల్లోనే సీపీఎంకు రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉంది. 9 లోక్‌సభ స్థానాలే ఉండటంతో పాటు కేవలం 3.25 శాతం ఓట్లు మాత్రమే కలిగి ఉంది. దీంతో ఆ పార్టీ జాతీయ హోదాకు గండి పడే ప్రమాదం కనిపిస్తోంది. దీంతోపాటు.. బీఎస్పీ, సీపీఐ, ఎన్సీపీల జాతీయ హోదాను కూడా పరిశీలించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లోను, తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లోను ఈ పార్టీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందుకే వాటి విషయంపై కూడా ఓ నిర్ణయం తీసుకునే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది.