కస్తాల రామకిష్టు, గుండా మల్లేశ్, దాజీ శంకర్‌రావు, రంగనాథరావు బోలన్‌వార్
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ప్రజా ఉద్యమాలు పరమావధిగా, సమసమాజ నిర్మాణమే ప్రధానలక్ష్యంగా నిర్మితమైన పార్టీ ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు గట్టి పట్టు సాధించింది. నిజాం నిరంకుశ, రాచరిక పాలన, రజాకార్లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధగెరిల్లా పోరాటం చేసి పీడిత, తాడిత, అట్టడుగు వర్గాలకు చేరువైంది. అంతటి ఘనకీర్తిని సాధించిన సీపీఐని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతగానో ఆదరించారు.
1952లో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి 2009వరకు జరిగిన ఎన్నికల్లో ఏడు పర్యాయాలు పార్టీ విజయం సాధించింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మూడేసి సార్లు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వి భజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లిని యోజకవర్గం నుంచి ఓసారి విజయ కేతనం ఎగురవేసింది. శాసనసభలో ప్రజల పక్షాన వాణి వినిపించి ఎర్రజెండా ఖ్యాతిని కమ్యూనిస్టులు ఎలుగెత్తి చాటారు. 2014 నుంచి సీపీఐ ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తుండగా.. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ డి జిల్లాలో పోటీ చేస్తుందా..? లేదా..? అనే అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతుండడం గమనార్హం.
ఆసిఫాబాద్‌లో ఎర్రజెండా రెపరెపలు..
పాత ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సీపీఐకి బలమైన పట్టు కలిగిన స్థానంగా విరాజిల్లింది. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రథమంగా గుండా మల్లేశ్ సీపీఐ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభంజనం లోనూ ఎ మ్మెల్యేగా గెలిచి సత్తాచాటారు. 1985లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లోనూ గుండా మల్లేశ్ సీపీఐ తరఫున పోటీలో నిలబడి విజయబా వుటా ఎగురవేశారు.
ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లోనూ మల్లేశ్ గెలిచారు. వరుసగా మూడు దఫాలు ఆసిఫా బాద్ నియోజకవర్గం నుంచి మల్లేశ్ విజయం సా ధించి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి పాత ఆసిఫాబాద్ అసెంబ్లీ నుంచి వేరుపడి బెల్లంపల్లి కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. బెల్లంపల్లికి 2009లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో గుండా మల్లేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డుకెక్కారు. నాలుగు పర్యాయాలు అసెంబ్లీకిప్రాతినిధ్యం వహించారు.
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో..
తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటం చేసిన కమ్యూనిస్టులను జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. సాయుధ పోరాట విరమణ అ నంతరం 1952లో దేశవ్యాప్తంగా సాధారణ ఎ న్నికలు జరిగాయి. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడంతో ఆ దిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క మ్యూనిస్టు నేత దాజీ శంకర్‌రావు ప్రొగ్రెసివ్ డె మొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో మరో కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ రంగనాథరావు బోలన్‌వార్ కూడా పీడీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967 లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా కస్తాల రామకిష్టు శాసనసభకు ఎన్నికయ్యారు.
గతమెంతో ఘనకీర్తి..!
ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన సీపీఐ క్రమక్రమంగా ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. ఎర్రజెండా మెరుపు కానరాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం సన్నగిల్లడంతోపాటు తాజా రాజకీయాలకు అనుగుణంగా ఎన్నికల్లో తలపడే అర్థబలం, అంగబలం లేకుండా పోయి చతికిలపడినట్లుగా సీపీఐ శ్రేణులు అంగీకరిస్తున్నారు.
ఒకానొక దశలో ఉమ్మ డి జిల్లాలో ఎర్రజెండాను రెపరెపలాడించిన కమ్యూనిస్టులు ప్రస్తుత వర్తమానకాల పరిస్థితులకు సరి తూగలేక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయలేక పొత్తులకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ పరి ణామాల క్రమంలో గతమెంతో ఘనకీర్తిగా చెప్పుకో వాల్సిన పరిస్థితులు కమ్యూనిస్టులకు ఏర్పడ్డాయి.
ఈసారి ఎన్నికల్లో..
ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికల నుంచి సీపీఐ ప్రా తినిధ్యం కరువైంది. 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి ని యోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా గుండా మల్లేశ్ పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఈసారి ఎన్నికల్లో సీపీఐ పోటీ చేస్తుందా..? లేదా..? అనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దఫా కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నా పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రానట్లుగా తెలుస్తోంది. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చే యాలని ఆరాటపడగా కాంగ్రెస్ చెన్నూర్ స్థానాన్ని కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుండగా కమ్యూనిస్టు శ్రేణుల్లో నిరాశ ఆవరించింది.
ఇవి చదవండి: 'బోథ్' కాంగ్రెస్‌లో.. అభ్యర్థిని మార్చుతున్నారనే ప్రచారంతో లొల్లి!?
Comments
Please login to add a commentAdd a comment