తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
తీర్థప్రసాదాలు, శ్రీవారి ఫొటో, నమామి గోవిందం కిట్, అగర్‌బత్తీలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన స్వామివారి ఫొటోను టీటీడీ చైర్మన్ అందజేశారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు సీజే శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజలు చేశారు.
తిరుచానూరులో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వీరికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్‌ఠాకూర్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment