
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా గత ఐదేళ్లు పరిపాలించిన టీడీపీని ఓడించాలని సీపీఐ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది. అవకాశవాదం, పార్టీ ఫిరాయింపులు, భూ పందేరాలు, అవినీతికి చంద్రబాబు ప్రభుత్వం మారుపేరుగా నిలిచిందని ధ్వజమెత్తింది. ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం మీడియాతో మాట్లాడారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యనూ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనుకుంటున్న తీరు ఏవగింపు కలిగిస్తోందని మండిపడ్డారు. కాగా సీపీఐ, సీపీఎం జాతీయ నేతలు డి.రాజా, సీతారాం ఏచూరీ ఈనెల 25న విజయవాడ రానున్నారని రామకృష్ణ చెప్పారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం విజయవాడ బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment