టెక్నాలజీని అద్దెకిస్తాం! | Technology will be rented! | Sakshi
Sakshi News home page

టెక్నాలజీని అద్దెకిస్తాం!

Published Sat, Sep 22 2018 12:32 AM | Last Updated on Sat, Sep 22 2018 4:49 AM

Technology will be rented! - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇల్లు, కార్ల లాగే టెక్నాలజీనీ అద్దెకు తీసుకోవచ్చు. అది కూడా హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ఆన్‌గో ఫ్రేమ్‌ వర్క్‌లో! మన దేశంతో పాటూ దుబాయ్, మధ్య ప్రాచ్య వంటి దేశాల్లోని కంపెనీలూ కస్టమర్లుగా ఉన్నాయి. జస్ట్, 30 నిమిషాల్లోనే డిజిటల్‌ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించే వీలుండటమే ఆన్‌గో ఫ్రేమ్‌ వర్క్‌ ప్రత్యేకత! అందుబాటు ధరల్లో ఎంటర్‌ప్రైజ్‌లకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలకు టెక్నాలజీలను అద్దెకిస్తున్న ఆన్‌గో ఫ్రేమ్‌ వర్క్‌ గురించి మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్‌ రామకృష్ణ కుప్పా ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 

మాది హైదరాబాద్‌. ఆచార్య నాగార్జున వర్సిటీలో ఎంఎస్‌ పూర్తయ్యాక.. బెంగళూరులో ఒకట్రెండు స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరా. తర్వాత అక్కడి నుంచి మైండ్‌ట్రీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బృందంలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరా. తర్వాత మోటరోలాలో సీనియర్‌ ఇంజనీర్‌గా చేరా. 2009లో ఎస్‌ఎంఈలకు మొబిలిటీ సొల్యూషన్స్‌ అందించే క్రియేటివ్‌ ఎక్స్‌పర్ట్స్‌ కన్సల్టింగ్‌ అనే ఐటీ కంపెనీని ప్రారంభించాం.

ఈ సమయంలో తెలిసిన విషయమేంటంటే.. టెక్నాలజీ అభివృద్ధి కోసం అయ్యే వ్యయం ఎక్కువగా ఉన్నందువల్లే పె ద్ద కంపెనీలు సైతం డిజిటల్‌ వైపు మళ్లటం లేదని! అభివృద్ధి వ్యయాన్ని తగ్గించాలంటే ముందుగా సమయాన్ని, నిర్వహణ ఖర్చును తగ్గిస్తే సరిపోతుందని తెలిసి.. రకరకాల టెక్నాలజీలను అద్దెకు ఇస్తే సరిపోతుందని నిర్ణయించుకున్నాం. అలా 2015లో నా భార్య అను అఖిలతో కలిసి రూ.1.2 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌గో ఫ్రేమ్‌ వర్క్‌ కంపెనీని ప్రారంభించాం.

ఏపీ, తెలంగాణ నుంచి 400 కంపెనీలు..  
ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), మిషన్‌ లెర్నింగ్, కాగ్నెటివ్‌ కంప్యూటింగ్, క్లౌడ్‌ టెక్నాలజీ, ఆటోమేషన్, ఈఆర్పీ, వాలెట్‌ ప్రోగ్రామింగ్‌ వంటి అన్ని రకాల టెక్నాలజీలు ఉంటాయి. ప్రస్తుతం ఆర్ధిక, వ్యవసాయ, రియల్‌ ఎస్టేట్, బీమా, వైద్యం, ఫుడ్‌ టెక్‌ రంగాల్లో ఎంటర్‌ప్రైజ్, ఎంఎస్‌ఈ రెండు విభాగాల్లో కలిపి 900 కంపెనీలు మా టెక్నాలజీని అద్దెకు తీసుకున్నాయి.

వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 400 కంపెనీలుంటాయి. దుబాయ్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సుమారు 20 కంపెనీలు కూడా ఉన్నాయి. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ, నిర్మాణ కంపెనీలు వీటిల్లో కొన్ని. ఇక, లోకల్‌ కంపెనీల్లో ఈ–సహాయ్, పేవైస్, లోహిత, బెల్‌ రైస్‌ వంటివి ఉన్నాయి.

2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్‌..
ప్రస్తుతం నెలకు 10 ఎంటర్‌ప్రైజ్‌లకు, 300 ఎస్‌ఎంఈలకు ఫ్రేమ్‌ వర్క్‌ ఫీచర్స్, ప్రొడక్ట్‌ ఫీచర్స్, మొబైల్‌ యాప్, వెబ్‌ యాప్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ ట్రాన్సాఫర్మేషన్, ఎంటర్‌ప్రైజ్‌ మొబిలిటీ సేవలందిస్తున్నాం. టెక్నాలజీని బట్టి నెల అద్దె రూ.2 వేల నుంచి రూ.7 లక్షల వరకున్నాయి.

గతేడాది రూ.3 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి మరో రూ.7 కోట్లకు చేరుకుంటాం. 2020 నాటికి రూ.70 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 10 వేల ఎస్‌ఎంఈ కస్టమర్లను చేరుకోవాలన్నది టార్గెట్‌. త్వరలోనే అమెరికాలోని పలు టెలికం కంపెనీలతో టెక్నాలజీ సేవల ఒప్పందం చేసుకోనున్నాం.

త్వరలోనే రూ.35 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం మా కంపెనీలో 94 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 160కి చేర్చనున్నాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.10 కోట్ల నిధులను సమీకరించాం. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూస్‌ డైరెక్టర్‌ పారస్‌ పరేఖ్, విర్టుసా ఐటీ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిషీ చౌహాన్‌ వంటి ఐదారుగురు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరో రూ.35 కోట్ల నిధులను సమీకరించనున్నాం.

ముంబైకి చెందిన పలువురు వీసీ ఇన్వెస్టర్లతో చ ర్చలు జరుగుతున్నాయి. ‘‘ మా టెక్నాలజీ మీద శిక్షణ, డిజిటల్‌ మార్కెటింగ్‌ తదితర అంశాలపై అ వగాహన కల్పించడం కోసం హైదరాబాద్‌కు చెం దిన డిజిటల్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ హాకీస్టిక్‌ మీడి యా అనే స్టార్టప్‌ను కొనుగోలు చేశాం. ఎస్‌ఎంఈ కంపెనీలతో పనిచేసే మరో స్టార్టప్‌ను కొనుగోలు కు ఆసక్తిగా ఉన్నామని’’ రామకృష్ణ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement