
రామకృష్ణ, యాని, రేఖ, హరికృష్ణ
కవలలు హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖా నిరోషా హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తికమక తాండ’. తిరుపతి సత్యం సమర్పణలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజవుతోంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై, హిట్టవ్వాలన్నారు. ‘‘తికమక తాండ అనే ఊర్లోని ప్రజలకు మతిమరుపు అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు వెంకట్. ‘‘మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు తిరుపతి శ్రీనివాసరావు.