సాక్షి, వైఎస్సార్ జిల్లా : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌పై బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ ప్రజలలో ఉద్రిక్తత, అభద్రతా భావం నెలకొని అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కశ్మీర్ నాయకులను నిర్భందంతో ఉంచి దేశ విభజన సమయంలో పెద్దమనుషులు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం సరికాదన్నారు. హత్య కేసులు ఉన్న అమిత్ షా లాంటి వ్యక్తులకు హోంమంత్రి కేటాయిస్తే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment