
సాక్షి, కర్నూలు : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై దాడి జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం పరామర్శించకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైఎస్ జగన్ మీద జరిగిన దాడిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు కరువు జిల్లాల్లో పర్యటించి సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబరు 3వ తేదీన వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment