
ప్రముఖ సింగర్ సునీత గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జూబ్లీహీల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment