‘‘పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో చూస్తున్నాం. ఈ నేపథ్యంతో మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘సింబా’. ఈ సినిమా చూశాక కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా సంతోషమే’’ అని అనసూయ అన్నారు. జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’.
డైరెక్టర్ సంపత్ నంది అందించిన ‘సింబా’ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మురళీ మనోహర్ మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సింబా’. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు’’ అన్నారు. ‘‘ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముందు తరాల గురించి ఆలోచించండి’’ అన్నారు దాసరి రాజేందర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment