ఆ విషయం నేను చెప్పను.. చివాట్లు పడతాయి: పుష్ప-2పై అనసూయ | Anasuya Comments About Her Role In Pushpa 2 Movie | Sakshi
Sakshi News home page

Anasuya: 'పుష్ప-2 షూటింగ్‌.. మా సార్ నుంచి చివాట్లు పడతాయి'

Published Wed, Jul 24 2024 4:48 PM | Last Updated on Wed, Jul 24 2024 4:48 PM

Anasuya Comments About Her Role In Pushpa 2 Movie

టాలీవుడ్ నటి అనసూయ.. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి తెలుగులో స్టార్‌ నటిగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్ట్‌-1లో తనదైన నటనతో మెప్పించిన అనసూయ సీక్వెల్‌లోనూ మెప్పించనున్నారు. సుకుమార్‌- అల్లు అ‍ర్జున్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌ 6న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇదిలా ఉండగా.. అనసూయ భరద్వాజ్ మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. జగపతిబాబు, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్న సింబా చిత్రంలో ఆమె నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనసూయ మీడియా ప్రతినిధుల అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే పుష్ప-2 షూటింగ్‌ గురించి ప్రశ్న ఎదురవ్వగా.. తెలివిగా తప్పించుకున్నారు.

పుష్ప-2లో మీ పార్ట్‌ షూటింగ్‌ అయిపోయిందా? అని ‍అనసూయను ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. 'ఈ విషయాన్ని మీకు చెప్పొచ్చని ఎవరైనా చెప్పారా? అని అడిగింది. ఈ విషయం బయటికి చెప్పాలంటే నాకు భయం.. నేను చెప్పను.. నాకు చివాట్లు పడతాయి మా సార్‌ నుంచి' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. కాగా.. సంపత్ నంది కథ అందించిన సింబా చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement