
ఇస్లామాబాద్: దశాబ్దాల నుంచి నిర్విరామ యుద్ధంతో విసిగిపోయిన అఫ్గనిస్తాన్ ప్రజలకు తక్షణ సాయం అవసరమని, వారికి మానవతా దృక్పథంతో కూడిన సాయం కావాలంటూ.. ఐక్య రాజ్య సమితి (యూఎన్‌ఓ) శరణార్థుల హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: "ఇది మా తప్పిదమే": యూఎస్
ప్రస్తుతం అఫ్గాన్ వాసులకు తక్కణ మానవతా సహాయంతోపాటు, ఆహారం, నివాసం, వైద్యం అత్యవసరమని ఇస్లామాబాద్ పత్రికా సమావేశంలో నొక్కి చెప్పారు. తాలిబిన్ల పరిపాలన విధానం, వారు విధించిన ఆంక్షాల కారణంగా మానవతా సాయం రాజకీయాలకు లోబడి ఉండకూడదంటూ సూచించారు. ప్రస్తుతం అక్కడ డబ్బు కొరత కారణంగా ప్రజా సేవలకు ఆస్కారమే ఉండదన్నారు. దీంతో అక్కడ మానవతా సంక్షోభం ఏర్పడి భయానకంగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రస్తుతం 18 మిలియన్ల మంది అఫ్గాన్ ప్రజలకు తక్షణ సాయం అవసరమని పేర్కొన్నారు.